అక్టోబర్ 27, 2012

వింటే భారతం వినాలి

Posted in సాహితీ సమాచారం at 7:52 సా. by వసుంధర

మహా భారతంలో పాత్రలు, సన్నివేశాలు నిత్యజీవితంలో మనకు అనుదినం తటస్థపడుతూనే ఉంటాయి. మా చిన్నప్పుడు ఇంట్లో పెద్దలు, క్లాస్ రూంలో టీచర్లు, వినోదం పేరిట హరిదాసులు, పురాణ పండితులు- మహాభారతంపట్ల కలిగించిన కాస్త అవగాహన జీవితంలో ఎంతో ఉపయోగపడుతోంది. నేడలాంటి జ్ఞానమూ, పరిజ్ఞానమూ, అవగాహనా కలిగించే అవకాశాలు అరుదైపోతున్న తరుణంలో- గరికిపాటి నరసింహారావు వంటి మహా పండితుల ఉద్భవం జాతి అదృష్టం. మహా భారత కావ్య సారాన్ని వ్యావహారికంగా విశ్లేషించడంలో వారిది అందె వేసిన చేయి. నేడు తెలుగు వారు మహాభారతం వింటే వారి నోట వినాలి. మచ్చుకి విరాటపర్వంపై వారి వ్యాఖ్యానానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ లంకె అందించిన శ్రీదేవి మురళీధర్‍కి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: