నవంబర్ 2, 2012

విశిష్ట సంస్కృత కావ్యాలు

Posted in భాషానందం at 10:13 ఉద. by వసుంధర

అసలే తెలుగు భాష భాష అందమైనది. ఆపైన సంస్కృతం తెలుగుకి సొగసులద్దింది. తెలుగులో సంస్కృతం ఎంతలా రాణించిందంటే- సంస్కృత పదాలు కూడా తెలుగులో మరింత మనోహరమౌతాయి. ఐతే సంస్కృతం భాష పరంగా, వ్యాకరణ పరంగా, పాండిత్యపరంగా ఎన్నో దేశ విదేశ భాషలను సుసంపన్నమూ, ప్రభావితమూ చేసి మూల భాష, దేవ భాష అనిపించుకుంది. ఆ భాషలో వచ్చిన ఎన్నో కావ్యాలు మానవాళిని ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. పాండిత్యపరంగా ఆ భాషలో జరిగిన ప్రయోగాలు- ఆసామాన్యం. వాటిలో ఒకటి దైవజ్ఞ సూర్య  రామకృష్ణ విలోమ కావ్యం. ఈ కావ్యాన్ని మనకి శ్రీ కమలాపతిరావు గారు అందించారు. వారికి ధన్యవాదాలు. ఇలాంటిదే మరో మహత్తర కావ్యం వెంకటాద్వరి   కవి  రచించిన అనులోమ ప్రతిలోమ కావ్యం- రాఘవ యాదవీయం. విపులమైన వ్యాఖ్యానంతో అంతర్జాల  అన్వేషణలో  అనుకోకుండా లభించగా వెంటనే దానిని  మనకు అందించిన డా. తాడేపల్లి పతంజలికి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: