నవంబర్ 9, 2012

బాల సాహిత్యానికి పురస్కారం

Posted in సాహితీ సమాచారం at 10:46 ఉద. by వసుంధర

సాహితీ బంధువులకు  నమస్కారం
ఒక రోడ్డు ప్రమాదంలో మరణించిన నా శ్రీమతి స్వర్గీయ నూకల పద్మస్మృత్యర్థం సాహితీ ప్రపంచానికి, సామాజిక ప్రపంచానికి సేవ చేయాలనే తలంపుతో నూకల పద్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో భాగంగా
బాలసాహిత్యంలో ఒక ఉత్తమ గ్రంధానికి  రూ. 10,116/- నగదు పురష్కారం ఇవ్వాలని సంకల్పించాను. 2007-2011 మధ్య కాలంలో ప్రచురించిన బాల సాహిత్య గ్రంధాలను ౩ ప్రతులనుఈ క్రింది చిరునామాకు నవంబర్ 14 తేది లోపల పంపాలి.
N. Saidireddy, Plot No: 132 (HIG), Behind BSNL Quarters,
Phase IV, Vanasthalipuram, HYDERABAD – 500070.
ఏ ప్రక్రియ అయినా పంపవచ్చు.అనువాదాలు,అనుసరణలు పంపవద్దు. సృజనాత్మకమైన స్వంత రచన అయి వుండాలి.బాలసాహిత్యం పిల్లలలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తూ, వినోద ప్రధానంగా వుండి, విజ్ఞానం అందిస్తూ వికాసం కలిగించేదిగా వుండాలి.
అర్హమైన గ్రంధం రాకపోతే ఆ బహుమతి మొత్తాన్ని బాలసాహిత్యంలో విశేష కృషి చేసిన లబ్ద ప్రతిష్టులైన బాలసాహితీ వేత్తలను ఒకరిని ఎన్నుకొని వారికి అందజేయ బడుతుంది.
ఆరోగ్య కరమైన, శక్తివంతమైన బాలసాహిత్య సృష్టి కి తోడ్పడాలని మా ప్రగాఢ  ఆకాంక్ష. సహకరించగలరని మనవి.
మరిన్ని వివరాలకు సంప్రదించండి.
నూకల సైదిరెడ్డి  9885861121
మేనేజింగ్ ట్రస్టీ
నూకల పద్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్

Leave a Reply

%d bloggers like this: