నవంబర్ 12, 2012

తెలుగులో టైపింగుకి కొన్ని చిట్కాలు

Posted in Uncategorized at 4:03 సా. by వసుంధర

బ్లాగులో నేరుగా తెలుగులో వ్రాయడానికి గతంలో కొన్ని చిట్కాలు ఇచ్చాం. వాటిలో విశాలాన్ ద్వారా లభించే PramukhIME ప్రయోజనాలు వివరించి ఉన్నాం. ఐతే ఈ సాఫ్ట్ వేర్ MS Wordలో నేరుగా టైపు చేసుకునేందుకు Windows 7లో ఎక్కువ వీలుగా ఉందనీ, Windows XPలో కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయనీ చాలామంది అంటున్నారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వారి వెబ్‍సైట్ మనకి ఎంతో ప్రయోజనం. దీనికి లంకె అందించిన శ్రీ తాడేపల్లి పతంజలికి ధన్యవాదాలు. ఇదే వెబ్‍సైట్ సిలికానాంధ్రవారిది కూడా ఉంది.

ఈ సైటులో 18 fonts ఉన్నాయి. వాటిని డౌన్‍లోడ్ చేసుకుని, కంప్యూటర్ సి డ్రైవ్‍లో ఆ ఫాంట్సుని కాపీ చేసుకుని నేరుగా MS Wordలో Windows XPలో కూడా మీకు నచ్చిన చక్కని ఫాంట్ ఎన్నుకుని హాయిగా టైపు చేసుకోవచ్చు. ఏ ఫాంట్ ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. మీ రచనల్ని అనూ ఫాంట్స్ కి దీటు వచ్చేలా MS Word (Windows XP)లో అందంగా టైపు చేసుకోగల అవకాశం ఇప్పుడు మీ ముందుంది.

Leave a Reply

%d bloggers like this: