డిసెంబర్ 4, 2012

సాహితీ ప్రకటనలు

Posted in సాహితీ సమాచారం at 7:59 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు-
ఈ క్రింది ప్రకటనలు “తెలుగు వెలుగు” జనవరి 2012 సంచికలో వచ్చినవి:
యువ రచయితలకు పురస్కారాలు
కవిత్వం, నవల, కథ ప్రక్రియల్లో యువ రచయితల సృజనలను ఆహ్వానిస్తున్నట్లు కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు అలపర్తి పిచ్చయ్య తెలిపారు. ఎంపికైన రచనలకు పురస్కారాలు ఉంటాయి. రచనలను ఈ నెల 20లోపు పంపాలి. వివరాలకు 9177013845
కవితలకు ఆహ్వానం
మచిలీపట్నం “సాహితీ మిత్రులు” ఆధ్వర్యంలో కవితల పోటీ జరుగుతోంది. మద్య వ్యతిరేకత అంశంపై ముఫై పాదాలకు మించకుండా వచన కవిత, అవినీతి వ్యతిరేకతపై ఒక్కొక్కరు పది మినీ కవితలూ జనవరి పదో తేదీలోగా పంపవచ్చు. విజేతలకు బహుమతులు ఉంటాయి. వివరాలకు 92475 81825
రజతోత్సవ పురస్కారానికి ఆహ్వానం
ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు రజతొత్సవ పురస్కారం 2012కు కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు వ్యవస్థాపకులు డా. రాధేయ తెలిపారు. ఈ పురస్కారానికి 2012లో ప్రచురించిన కవితా సంపుటాలను మాత్రమే జనవరి 31లోగా పంపాలి. ఎంపికైన సంపుటికి నగదు పురస్కారం ఉంటుంది. వివరాలకు 99851 71411
జాతీయస్థాయి కవితల పోటీ
జాతీయస్థాయి కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ తెలిపారు. 30 వరసలకు మించకుండా ఏ సామాజిక అంశం పైనైనా ఈ నెల పదో తేదీలోగా కవితలు పంపించవచ్చు. వివరాలకు 90107 71622
కథలకు ఆహ్వానం
తెలుగు సమాజం మీద టీవీ ప్రభావాన్ని ప్రతిఫలించే కథలను ఆహ్వానిస్తున్నట్లు సంకలనకర్తలు ఎ.కె.ప్రభాకర్, నాగసూరి వేణుగోపాల్ తెలిపారు. ప్రాంతీయ భాషల్లో ఇరవైనాలుగు గంటల టీవీ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాక తెలుగు సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ ప్రసారాలు మన ఆలోచనా సరళిని, జీవన విలువల్ని, వేషభాషల్ని, ఆహారవిహారాల్ని కళాభిరుచుల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. 1999 నుంచి ఇప్పటివరకూ ప్రచురితమైన కథల్ని సేకరించి సంకలనం చేయనున్నారు. వివరాలకు: 96766 76928

1 వ్యాఖ్య »

  1. Jahnavi said,

    Thanks for your information andi.
    Ekkadaki send cheyaalo addresses kooda teliyacheyagalaru.
    phone numbers sarigga work avadam ledu.


Leave a Reply

%d bloggers like this: