డిసెంబర్ 13, 2012

నవగ్రహ స్తోత్రం

Posted in దైవం at 10:13 ఉద. by వసుంధర

ప్రకృతిలో దైవాన్ని చూసి భక్తితో ఆరాధించడం భారతీయ సంప్రదాయం. సాటి వారికి హాని కలిగించని భక్తి వ్యక్తికీ, సమాజానికీ ప్రశాంతతనీ, సుఖశాంతుల్నీ, సంతృప్తితో కూడిన సంతోషాన్నీ ఇచ్చి ఎంతో  ప్రయోజనకారి ఔతుంది. అటువంటి భక్తి గురించిన మా అవగాహనను భక్తిగిరి పేరిట గతంలో పాఠకులతో పంచుకున్నాం.

మన ప్రధాన భక్తి మార్గాల్లో నవగ్రహ స్తోత్రం ఒకటి. ఆ స్తోత్రాన్ని టీకా తాత్పర్య సహితంగా సులభగ్రాహ్యంగా వివరించి, అందులో ఉటంకించబడిన పూలను ఛాయాచిత్రాల్లో పరిచయం చేశారు డా. తాడేపల్లి పతంజలి. ఆ వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

డా. తాడేపల్లి పతంజలికి ధన్యవాదాలు.

4 వ్యాఖ్యలు »

 1. Siva Ram said,

  చాలా చక్కగా ఉంది.. కాని శని దేవుడి స్త్రొత్రం లేదు అందులొ .. గమనించారా..అది కూడా చేర్చి మరలా ఇవ్వగలరా..

  • గౌరవనీయులు శివరాం గారికి,
   మీరు చెప్పినది నిజమే.
   పిడిఎఫ్ మెర్జ్డ్ ఫైల్ లో పొరబాటున శనిదేవుని స్తోత్రం రాలేదు.
   శనిదేవుని స్తోత్రం కలిసిన పిడిఎఫ్ మెర్జ్డ్ ఫైల్ వసుంధర గారికి పంపించాను.
   తప్పును సవరించుకొనే అదృష్టం కలుగజేసిన మీకు ధన్యవాదములు . -డా.తాడేపల్లి పతంజలి

 2. deviram. said,

  Dear Respected Madam / sir
  నవగ్రహస్తోత్రం మేకాక ఏస్తోత్రమైనా తప్పులు లేకుండా , పదాలు సరిగా ఉచ్చరిస్తూ చదవాలంతారు పెద్దలు.మరి ఇక్కడ రోజూ మేం చదివే పదాలకు ఇక్కడ ఇచ్చినపదాలకూ కొంత తేడాకనిపిస్తున్నది.ఏది సరైనది? పూర్వం నుండీ మానాయనగారి వద్దమేము నేర్చిన నవగ్రహస్తోత్రంలోని పదాలు నేనుక్రింద బ్రాకెట్స్ లో చూపినది విధంగా ఉన్నాయి, పైన ఉన్న విధంగా ఉన్నపదాలు మీరిచ్చి నదానిలో ఉన్నాయి, ఏది సరైనది? పూర్వం నుండీ మేము చదువుతున్నపదాలు సరైనవికావా! దయచేసి నా అనుమానం తీర్చగలరు. అన్ని ఆలయాలలోనూ నేను పైన చూపినట్లే ఉంటున్నది.
  దేవీరాం
  ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్ |
  సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్//
  [సౌమ్యం సత్వ]

  దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసంనిభమ్ |
  బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||
  [బుధ్ధి మంతం]
  అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్దనమ్ |
  [మహా వీరం]
  సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ |

  • దేవిరాం గారికి
   నాకు స్వామి అనుగ్రహం తో లభించిన నవగ్రహ సంస్కృత స్తోత్రంలో అర్థాలు వివరించే ప్రయత్నం చేసాను .
   పూర్వ శ్లోకాలలో పాఠ భేదాలు తప్పవు. అయినా అర్థాలలో పెద్దగా మార్పులు రావు. ఉదాహరణకి ‘మహా వీరం’ అన్నా ‘మహా వీర్యం’ అన్నా ఒక్కటే . అర్థంలో మార్పు లేదు. మహావీర్య ప్రయోగం వాల్మీకికూడా చేసారు. (కిష్కింధ -16-15శ్లో.)
   మీరు చెప్పిన కుండలీకరణములలోని పదాలు కూడా ప్రసిద్ధాలే. రెండు పాఠాలు ప్రసిద్ధాలైనప్పుడు,మనస్సుకు పట్టిన పాఠాన్ని శ్రద్ధగా చదువుకొంటే స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు. నవగ్రహ స్వరూపుడైన జనార్దనుడు భావగ్రాహి. చదివే వాడి మనస్సులోని భక్తిని , భావాన్ని గ్రహించి రక్షిస్తాడు.
   యదక్షర పద భ్రష్టం మాత్రా హీనంతు యద్భవేత్. తత్ సర్వం క్షమ్యతాం దేవ! నారాయణ నమోస్తుతే


Leave a Reply

%d bloggers like this: