డిసెంబర్ 15, 2012

నేడు ఒక ప్రత్యేక సుదినం

Posted in చిత్రజాలం at 7:42 సా. by వసుంధర

Bapu గత శతాబ్దంనుంచీ చిత్రకళలో హాస్య వ్యంగ్య చిత్రాలకి కార్టూన్ల పేరిట ప్రత్యేక స్థానం లభించింది. తెలుగునాట కార్టూన్లకు శ్రీకారం చుట్టింది శ్రీ తలిసెట్టి రామారావు. ప్రాచుర్యం తెచ్చింది బాపు-రమణ. వారికి దీటుగా రంజింప జేసినవారిలో జయదేవ్, బాబు, బాలి, చంద్ర, సత్యమూర్తి, రాగతి పందరి, సరసి వంటి వారున్నారు. మన కార్టూనిస్టులలో చాలామంది బాపుని ప్రేరణగానైనా తీసుకున్నారు, లేదా అనుసరించారు. అందువల్ల తెలుగు కార్టూన్ చరిత్రలో బాపుది ప్రత్యేక స్థానం. నేడు బాపు పుట్టిన రోజు.  ఆయనకు 79 నిండి 80లో ప్రవేశించిన రోజు.

  అక్షరజాలంలో- చక్కని పిల్లల కథల్ని బాలబండారంలోనూ, ఉత్తమ స్థాయి కార్టూన్లని చిత్రజాలంలోనూ, మంచి సాంఘిక కథల్ని కథాజాలంలోనూ పొందుపర్చాలని చాలాకాలంగా ఆశ. కొంచెం సమయం తీసుకున్నా,     మాకు సాఫ్ట్ కాపీలౌగా అందిన చక్కని ఇతివృత్తాల్ని అవసరమైన మేరకు సవరించి ప్రచురించగలం. ఈ ప్రకటనకు బాపు పుట్టిన రోజుకి మించిన సుదినం లేదని స్వాభిప్రాయం. ఎందుకంటే సాంఘిక కథలకు బాపు బొమ్మలు కొత్త రూపాన్నిస్తే,  పిల్లల కథలకు బాపు ద్వారా బుడుగు, సీగానపెసూనాంబ, పక్కింటి లావుపాటి పిన్నిగారు ప్రాణం పోసుకున్నారు.

 అతిత్వరలో పిల్లల కథలు మొదలు కానున్నాయి.  ప్రతిభావంతులైన కొత్త కార్టూనిస్టులు పరిచయం కానున్నారు. ఇంకా సాహిత్యానికి సంబంధించిన కొత్త అంశాలు రానున్నాయి. తెలుగు సాహితీ కథా సుధా వేదికగా అక్షరజాలం మిమ్మల్ని అలరించనున్నది.

బాపు అసామాన్య ప్రతిభామూర్తి. కొండంత దేవునికి కొండంత పుష్పాన్నివ్వలేమని మన ప్రభుత్వం ఆయనకు పద్మా పురస్కారాలకు దూరంగా ఉండి ఉండొచ్చు. కానీ తాను చిన్నబోయానని పద్మా అవార్డు ఘోషిస్తున్నదట. ఈ సంవత్సమైనా ఆ అవార్డు తన విలువను మరింతగా పెంచుకుంటుందేమో చూద్దాం.  పుట్టినరోజు సందర్భంగా శ్రీ బాపుకి అభినందనలు. వారి ప్రతిభకు అభివందనాలు. పద్మా పురస్కారానికి శుభాకాంక్షలు.

5 వ్యాఖ్యలు »

  1. BHAVARAJU NARAYANA MURTY said,

    SRI BAPU GARU IS NOT ONLY A GREAT CARTOONIST BUT ALSO A MULTI FACETED GENIOUS AND ABOVE ALL AN EXCEPTIONALLY FINE HUMAN BEING. HE ,IN FACT , ADDS GREAT VALUE TO ANY AWARD THAT ADORNS HIM. AWARDS SHOULD BE LUCKY ENOUGH FOR THAT HONOUR. ALL OF US PRAY FOR THE CHOICEST BLESSINGS OF LORD VENKATESWARA ON SRI BAPU GARU FOR A LONG HAPPY,PROSPEROUS AND HEALTHY LIFE. GOD BE WITH HIM AND HIS FAMILY ALWAYS.
    B N MURTY, VIRGINIA, USA

    • you reflect the feelings and sentiments of all learned telugu people. thanks.


Leave a Reply

%d bloggers like this: