జనవరి 9, 2013
ఉగాది కథల పోటీ- స్వప్న
శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు…..
స్వప్న మాసపత్రిక- శ్రీమతి చిట్టా స్వరాజ్యలక్ష్మి, శ్రీ చిట్టా సుబ్రహ్మణ్యం పురస్కారంగా ఉగాది కథల పోటీ నిర్వహిస్తోంది
మొదటి బహుమతి రూ 7,000/-
రెండవ బహుమతి రూ 5,000/-
మూడవ బహుమతి రూ 2,500/-
నిబంధనలు
కథలు తెలుగువారి సామాజిక, కుటుంబ, జీవితానికి సంబంధించినచై వుండాలి
కథలు ఫుల్ స్కేప్ సైజు లో (పేజికి 30 లైన్ల చొప్పునైతే) 6 పేజీలకు మించకూడదు. (ఓ అరపేజీ దాకా మినాహాయింపు)
హామీ పత్రం, తిరుగు టపా కవరు తదితర షరా మామూలే
కథలు పంపవలసిన చివరి తేది: మార్చి 2, 2013
బహుమతి పొందిన కథల ప్రచురణ: ఏప్రిల్ 2013 సంచిక నుంచి..
గమనిక: రచనలు పంపేవారు ఫలితాలు వెలువడే ఏప్రిల్ సంచిక దాకా వేచి ఉండకుండా, వారికి బహుమతి ఎంపికకు అర్హం కానివి అని భావించిన వాటిని ఎప్పటికప్పుడు త్రిప్పి పంపుతారు. ఇందువల్ల ఆయా రచయితలు, రచయిత్రులు పోటీ గడువు లోపల మరో కథ పంపడానికి అవకాశం ఉంటుంది.
soujanya said,
జనవరి 18, 2013 at 1:53 ఉద.
daya chesi address cheppandi
వసుంధర said,
జనవరి 18, 2013 at 9:31 సా.
చిరునామా అక్షరజాలంలో నెలనెలా మన పత్రికలు శీర్షికలో మేమిచ్చే స్వప్న పత్రిక విషయసూచికలో లభిస్తుంది. మీ సౌకర్యార్థం చిరునామా మరోసారి ఇక్కడ ఇస్తున్నాం-
Editor, Swapna
Sterling Media & Entertainment
3/2 North Usman Road
T. Nagar Chennai 600 017
Ph: 42122158