జనవరి 9, 2013
ప్రబంధ రచనల పోటీ ఫలితాలు- నది
శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు
నది మాసపత్రిక నిర్వహించిన ప్రబంధ రచనల పోటీ ఫలితాలను ప్రకటించారు.
ఉత్తమ ప్రబంధం: కీ.శే. గడియారం శేషఫణి శర్మ- ’పుత్రోదయం’ స్వర్గీయ శ్రీ అవ్వా వేంకట అప్పారావు సాహితీ అవార్డు రూ 1,75,000/-
ద్వితీయం: డా. రామడుగు వేంకటేశ్వర శర్మ – ’శ్రీ చంచులక్ష్మి కల్యాణం’ రూ. 70,000/-
తృతీయం: ’స్మితశ్రీ’ చింతపల్లి నాగేశ్వరరావు ’నర్మదాపురుకుత్సీయం’ రూ. 30,000/-
ప్రబంధ రచనలు పంపినవారందరికీ ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు.
విజేతలకు అభినందనలు. సుమారు శతాబ్దకాలం అనంతరం ఇలాంటి ప్రబంధ రచనల పోటీ నిర్వహించి, ఇంత పెద్ద మొత్తంలో బహుమతులు అందజేసిన నది పత్రిక వ్యవస్థాపకులు, యాజమాన్యం ప్రత్యేకంగా అభినందనీయులు.
Leave a Reply