ఫిబ్రవరి 14, 2013

కథల పోటీ – హంసిని

Posted in కథల పోటీలు at 9:58 సా. by వసుంధర

హంసిని మూడవ ఉగాది ఉత్తమ రచనల పోటీ ప్రకటన

విజయ నామ సంవత్సర ఉగాది సందర్భంగా హంసిని వెబ్ పత్రిక ఉగాది తెలుగు ఉత్తమ రచనల పోటీని నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. విజేతలకి ప్రశంసాపత్రాలతో బాటు ఈ క్రింది విధంగా నగదు పారితోషికాలు ఇవ్వబడతాయి.

ఉత్తమ కథానిక:
మొదటి బహుమతి: $116
రెండవ బహుమతి: $51
మూడవ బహుమతి: $51
ప్రచురణార్హమైన కథానికలు: $15

ఉత్తమ కవిత:
మూడు సమాన బహుమతులు: ఒక్కొక్కటి $51
ప్రచురణార్హమైన కవితలు: ప్రశంసాపత్రం

పోటీలకీ ముఖ్య గమనికలు:

* నచ్చిన ఇతివృత్తం ఎన్నుకోవచ్చును. ఆదునిక కధ/కవిత, ఇతర కధ/కవితా ప్రక్రియలూ అన్నీ ఆమోదయోగ్యమే.
* రచన చేరవలసిన ఆఖరి రోజు మార్చ్ 15, 2013.
* ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ రెండు ఎంట్రీలు పంపించవచ్చును.
* కధ వ్రాత ప్రతిలో ఇరవై పేజీల లోపు ఉంటే బావుంటుంది, కవిత ఐదు పేజీల లోపు ఉంటే బావుంటుంది.
* రచయితల యొక్క అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. బ్లాగులు, వెబ్ సైట్స్, వెబ్ పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించబడ్డ రచనలు పరిగణింపబడవు.
* బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు హంసిని వెబ్ పత్రికలో ప్రచురించబడతాయి.
* ఫలితాలు ఏప్రిల్ 15, 2013 గాని అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి.
* రచనలపై సర్వాధికారాలు రచయితకే చెందుతాయి. కాని, రచయితలు తమ ఎంట్రీలను పోటీ ఫలితాలు ప్రకటించే లోపు ఇంకెక్కడా ప్రచురించవద్దని మనవి.
* విజేతల ఎన్నికలో హంసిని నిర్వాహకులదే తుది నిర్ణయం.
* రచనల్ని యూనికోడ్ ఫాంట్స్ లో hamsini@andhraheadlines.comకి పంపాలి. ఒకవేళ మీకు యూనికోడ్ లో టైప్ చేసే సౌకర్యం లేకపోతే మీరు మీ రచనలను స్కాన్ చేసి PDF ఫైల్స్ పంపించవచ్చు. దయచేసి వీలైనంత వరకు యూనికోడ్ లో టైప్ చేసి పంపించగలరని కోరుతున్నాం. రచనను ఈమెయిలులో రాసి పంపవచ్చు, లేదా ఈమెయిలుకు జోడింపుగా టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో కూడా పంపవచ్చు. రచనలు పంపే విషయంలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ( hamsini@andhraheadlines.com ) ఈమెయిల్ అడ్రస్‌కు మీ ప్రశ్నలు పంపించండి. మేము సాధ్యమైనంత త్వరలో మీకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాం.

Leave a Reply

%d bloggers like this: