మార్చి 27, 2013

కథలు, కవితల పోటీ- సాహితీకిరణం

Posted in కథల పోటీలు at 10:17 ఉద. by వసుంధర

సాహితీ కిరణం చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా కథలు, కవితల పోటీలు

కార్తికా డవలపర్స్ వారి సౌజన్యం తో..
హాస్య కథల పోటీ (బహుమతుల మొత్తం రూ. 5000/-)

ప్రధమ బహుమతి రూ. 1800/-
ద్వితీయ బహుమతి రూ. 1200/-
తృతీయ బహుమతి రూ.750/-
5 ప్రోత్స్చాహక బహుమతులు ఒకొక్కరికి రూ.250/-

కథ ఏ అంశానికైనా చెందినదై హాస్యం గా ఉండాలి. హాస్యం పేరుతో అశ్లీలత చోటు చేసుకో కూడదు. కథ అచ్చులో మూడు పేజీలకు మించ కూడదు. హామీపత్రం విధిగా జత చేయాలి. కవరు మీద       ‘కార్తీక డవలపర్స్ హాస్య కథల పోటీ కి’ – అని స్పష్టం గా పేర్కొనాలి.

డా. .పట్టాభి కళాపీఠం సౌజన్యంతో కవితల పోటీ (బహుమతుల మొత్తం రూ. 4000/-)
ప్రధమ బహుమతి రూ. 1500/-
ద్వితీయ బహుమతి రూ.1000/-
తృతీయ బహుమతి రూ. 500/-
5 ప్రోత్స్చాహక బహుమతులు ఒక్కొక్కరికి రూ. 200/-
కవిత ఏ అంశానికైనా చెందినదై ఉండవచ్చును. కవిత 20 లైన్లకు తక్కువ కాకుండా 30 లైన్లకు మించకుండా వుండాలి. హామీ పత్రం విధిగా జత చేయాలి. కవిత పంపే కవరు మీద సాహితీ కిరణం చతుర్థ వార్షికోత్సవ కవితల పోటీ కి అని స్పష్టం గా పేర్కొనాలి.

కవి/కవయిత్రి/రచయిత/రచయిత్రి/ చిరునామా ఫోన్ నెం. వగైరా కవిత/హాస్య కథ ఉన్న పేపరు మీద కాకుండా విడిగా హామీ పత్రం పై రాయాలి. బహుమతి పొందని కవితలు, కథలు కొన్నింటిని సాధారణ ప్రచురణకు స్వీకరించబడతాయి. వాటికి ఎటువంటి పారితోషికం ఉండదు.
బహుమతి ప్రధానోత్సవం 28 మే 2013 న హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గాన సభ కళా సుబ్బారావు కళా వేదికలో జరుగుతుంది. విజేతలు స్వయంగా వచ్చి బహుమతి తీసుకొనవలసి వుంటుంది.
హా స్య కథ లు/ కవితలు చేరవలసిన ఆఖరి తేది 30 ఏప్రియల్ 2013
చిరునామా 11-13-154, రోడ్ నెం. 3 అలకాపురి, హైదరాబాద్ 500 035, సెల్: 9490751681

2 వ్యాఖ్యలు »

 1. ఆర్.దమయంతి said,

  నారీ భేరి
  ఉగాది హాస్య కథలు, కవితల పోటీ

  ఉగాది హాస్య కథలు, కవితల
  ఉగాది సందర్భంగా నిర్వహించే హాస్య కథలు, కవితల పోటీ లకు నారీ భేరి మాస పత్రిక – ఆహ్వానం పలుకుతోంది.
  బహుమతి వివరాలు.
  హాస్య కథలకు
  ప్రథమ బహుమతి రూ. 1,116.
  ద్వితీయ బహుమతి రూ.516.
  తృతీయ బహుమతి రూ.216.
  కవితలకు
  ప్రథమ బహుమతి రూ.516
  ద్వితీయ బహుమతి రూ.216.
  తృతీయ బహుమతి రూ.116.
  పోటీ నిబంధనలు:
  * కథ, కవిత ప్రతుల మీద పేరు మాత్రమే ఉండాలి. రచయితకు సంబంధించిన సమాచారంతో పాటు హామీ పత్రాన్ని ప్రత్యేకంగా జతపర్చాలి.
  * ఎ4 సైజు కాగితం పై చక్కని చేతి వ్రాత్రతో ఒక పక్క మాత్రమే రాయాలి. 2 పేజీలకు మిం చకూడదు.
  * అశ్లీలత, అసభ్యత కుల, మత విద్వేషాల్ని రెచ్చగొట్టే ధోరణులు, రాజకీయాలు, వెకిలితనం లేకుండా హాయిగా నవ్వించే కథలు, సృజనాత్మక కవితలు పంపాలి.
  * ఎంపిక కాని కథలు, కవితలపై ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలుండవు.
  * రచనలు తిప్పి పంపాలని కోరుకునే రచయితలు అందుకు అవసరమైన స్టాంపులు అంటించిన కవర్లు జత పర్చాలి. రచయితలు తమ చిరునామాను స్పష్టం గా (ఫోన్ నెంబర్ తో సహా) రాయాలి.
  *అంతిమ నిర్ణయం న్యాయ నిర్ణేతలదే.
  * రచనలు చేరవల్సిన ఆఖరి తేది : ఏప్రిల్ 15.
  చిరునామా:
  సంపాదకులు
  నారీ భేరి సంపూర్ణ మహిళా మాస పత్రిక
  డోర్ నెంబర్ 12-3-129, మేడ పైన 4 వ క్రాస్, సాయి నగర్, అనంతపురం.
  సెల్ : 9492330110
  *****

  • ఈ సమాచారానికి ధన్యవాదాలు. టపాలో కూడా ఇస్తున్నాం


Leave a Reply

%d bloggers like this: