ఏప్రిల్ 16, 2013
కథల పొటీ- ఆంధ్రభూమి దినపత్రిక
ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహిస్తున్న కథల పోటీ గురించి శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. ఈ క్రింద పొందుపరచిన వివరాలు ఈ లంకెలోనూ లభిస్తాయి.
తెలుగులో ఉత్తమ సాహితీ సృజనకి తనవంతు తోడ్పాటుగా మీ అభిమాన దినపత్రిక ‘ఆంధ్రభూమి’ ఎప్పటిలాగే ఈ ఏడూ కథల పోటీ నిర్వహిస్తున్నది.
ప్రథమ బహుమతి
రూ. 10,000
ద్వితీయ బహుమతి
రూ. 5,000
తృతీయ బహుమతి (2)
రూ. 3,000
ప్రత్యేక బహుమతి (4)
రూ. 1,000
*ఇతివృత్తం మీ ఇష్టం. భాషలో, శైలిలో, శిల్పంలో కొత్తదనానికి ప్రాధాన్యం. ఈ కాలపు జీవన రీతికి, ఈ తరం అభిరుచులకు, మారుతున్న విలువలకు అద్దంపట్టే రచనలకు స్వాగతం. హాస్యమా, శృంగారమా, మరొకటా అన్న రసపట్టింపులేదు.
*కథ నిడివి ఆదివారం అనుబంధంలో, భూమికలో కథకిచ్చే చోటుకు సరిపోయేలా ఉండాలి. మామూలు దస్తూరిలో 6నుంచి 8 పేజీలు రాస్తే చాలు. (డి.టి.పి. చేసి పంపితే ఎ4 సైజులో 3పేజీలు). నిడివి మరీ ఎక్కువగా ఉన్న రచనలను ఎంత బాగున్నా పరిశీలించము.
*రచన మొదట్లోనూ, చివరనా రచయిత పేరు (కలం పేరు వాడితే అసలు పేరు), చిరునామా, ఫోన్ నెంబరు స్పష్టంగా రాయాలి. కాగితానికి ఒక వైపే రాయాలి. రచన తమ సొంతమనీ, దేనికీ అనుకరణ, అనుసరణ కాదని, వేరే పోటీకి పంపలేదని, ఇంకే పత్రిక పరిశీలనలో లేదని హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి. ఇష్టమైతే ఫొటోకూడా పంపవచ్చు.
*గతంలో ఆంధ్రభూమి దిన, వార, మాస పత్రికలకు పంపితే తిరిగొచ్చినది మళ్లీ పంపకూడదు. జిరాక్స్ కాపీలు, కార్బన్ కాపీలు పరిశీలించడం కుదరదు. రచనలను పిడిఎఫ్ ఫార్మాట్లో ఇ-మెయల్ (abcontest@deccanmail.com) ద్వారా కూడా పంపవచ్చు.
*బహుమతి పొందిన రచనలను ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధం, భూమిక సప్లిమెంట్లలో ప్రచురిస్తాము.
*బహుమతి పొందని రచనలలో ఎంపిక చేసిన వాటిని సాధారణ ప్రచురణకు స్వీకరిస్తాము. వాటిని భూమికలోగాని, ఆదివారం అనుబంధంలో గాని వీలువెంబడి, మా ఇష్టాన్నిబట్టి ప్రచురించవచ్చు.
*సాధారణ ప్రచురణకు కూడా స్వీకరించని రచనలను తిప్పి పంపాలంటే తగిన స్టాంపులను అతికించి చిరునామా రాసిన కవరును జతపరచాలి. స్టాంపులు, కవరు విడివిడిగా పంపితే గల్లంతయ్యే ప్రమాదం ఉంది.
*పోటీకి సంబంధించిన అన్ని అంశాలమీద సంపాదకునిదే తుది నిర్ణయం. ఉత్తర ప్రత్యుత్తరాలకు ఆస్కారం లేదు.
కవరు మీద కథల పోటీకి అని తప్పనిసరిగా రాసి ఈ క్రింది చిరునామాకి ప్ంపాలిః
ఎడిటర్
ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవి రోడ్,
సికిందరాబాద్- 500 003.
కథలు చేరడానికి ఆఖరు తేదిః 15 జూన్ 2013
annapurna darbha said,
ఏప్రిల్ 16, 2013 at 12:23 సా.
rachana sampaadakulaku namaskaaramulu!
janaardana maharshigaaru yichchina bahumati chekku
amdimdi.dhanyavaadamulu.kaasta aalasyamgaa teliyajestunnamduku
mannimchagalaru.
darbha lakshmi annapurna
వసుంధర said,
ఏప్రిల్ 16, 2013 at 10:37 సా.
ఈ ఉత్తరం నేరుగా రచన సంపాదకులకు (rachanapatrika@gmail.com) పంపగలరు. రచన సంపాదకులు శ్రీ వైవిఎస్ఆర్ఎస్ శాయి.