ఏప్రిల్ 17, 2013

కథ, కవితల పోటీ ఫలితాలు- హంసిని

Posted in కథల పోటీలు at 9:17 ఉద. by వసుంధర

“విజయ” నామ సంవత్సర ఉగాది సందర్భంగా హంసిని నిర్వహించిన మూడవ(2013) హంసిని అవార్డ్స్ విజేతలు:

 

హంసిని కవిత్వ అవార్డ్: మోహనతులసి (“మెలకువ”)

బహుమతి: మామిడి హరికృష్ణ (“ఊరు బతుక బోతాంది…!”)

బహుమతి: డా. గరిమెళ్ళ నారాయణ (“ఉల్క పడింది!”)

ప్రశంసాపత్రం: అయినంపూడి శ్రీలక్ష్మి (“కాలం ఓ ఫీనిక్స్”)

 

హంసిని కథా అవార్డ్: పోలాప్రగడ జనార్ధనరావు (“జనని జన్మ భూమిశ్చ”)

బహుమతి: పి. వి. శేషారత్నం (“లాస్యలహరి”)

బహుమతి: తిరుమలశ్రీ (“ఆ క్షణం…!”)

ప్రశంసాపత్రం: స్వాతీ శ్రీపాద (“నిదురించే తోటలోకి”)

 

ప్రచురణకు స్వీకరించిన కవితలు:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ (“నిశ్చల గీతం వింటున్నాను”)

వారణాసి నాగలక్ష్మి (“గాలిపటాలనెగరేద్దాం పదండి!”)

గరిమెళ్ళ నాగేశ్వరరావు (“నాగరిక దుఃఖం”)

ఆర్.దమయంతి (“నేనే నీ విజయ కేతనాన్ని!”)

 

ప్రచురణకి స్వీకరించిన కథలు:

అమూల్య తెర్లి (“లక్ష్మి విలాస్”)

కే. బి. కృష్ణ (“దేవతార్చన”)

బాలాదేవి పింగళి (“ఆపిల్ పండు – ఆదాం”)

 

విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు!

 

హంసిని అవార్డ్స్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి మాకు సహాకరించిన ప్రముఖ రచయితలకు మా ధన్యవాదాలు. ఎంపిక అయిన రచనలతో బాటు, ప్రచురణార్హమైన ఇతర రచనలు హంసినిలో మే సంచికనుండి వరుసగా  ప్రచురింపబడతాయి. ఒక వారం రోజుల్లో బహుమతులు పోస్టులో పంపించబడతాయి.

 

(హంసిని కథా అవార్డ్ పొందిన కథకు ప్రశంసాపత్రంతో పాటు $116 నగదు పారితోషికం, బహుమతి పొందిన కథలకు ప్రశంసాపత్రంతో పాటు $51 నగదు పారితోషికం, ప్రశంసాపత్రం పొందిన కథలకు ప్రశంసాపత్రంతో పాటు $15 నగదు పారితోషికం, ప్రచురణకి స్వీకరించిన కథలకు $15 నగదు పారితోషికం అందజేయబడుతుంది.

హంసిని కవిత్వ అవార్డ్ పొందిన కవితకు ప్రశంసాపత్రంతో పాటు $51 నగదు పారితోషికం, బహుమతి పొందిన కవితలకు ప్రశంసాపత్రంతో పాటు $51 నగదు పారితోషికం, ప్రశంసాపత్రం పొందిన కవితలకు ప్రశంసాపత్రం అందజేయబడుతుంది. )

 

Leave a Reply

%d bloggers like this: