ఏప్రిల్ 27, 2013

అలనాటి చందమామలు- ధారావాహికలు

Posted in సాహితీ సమాచారం at 10:24 సా. by వసుంధర

శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ తమ బ్లాగు ద్వారా లభింపజేసిన సమాచారాన్ని యథాతథంగా ఈక్రింద అందజేస్తున్నాం. వారికీ- ఈ సమచారాన్ని ఈమెయిల్ ద్వారా మాకు అందజేసిన రచన శాయిగారికీ ధన్యవాదాలు
తెలుగు చందమామ అభిమానులు అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ విసుగు చెందని విక్రమార్కుల లాగ అలనాటి చందమామ (1947 నుంచి 1980 వరకు) వచ్చిన చందమామలు కాని, అప్పటి ధారా వాహికలుగాని ఎక్కడన్నా దొరుకుతాయా అని వెతుకుతున్న వారికి ఇదొక శుభవార్త.. 
ఈ రోజున చూద్దాం ఎక్కడన్నా దొరుకుతాయేమో అని చందామామ సీరియల్స్ ఇన్ యి పబ్ (పి డి ఎఫ్ లాగ ఇదొక డాక్యుమెంట్) అండ్ గూగులమ్మని అడిగాను. వెంటనే కమ్మటి వార్తా చెప్పింది.  ఇంటర్నెట్ ఆర్ఖైవ్ వెబ్ సైటులో మనకు చిరపరిచితమైన అలనాటి చందమామ ధారావాహికలు అప్లోడ్ చేశారు. అంటే కాదు అనేక రకాల ఫార్మాట్లల్లో ఉన్నాయి డౌన్లోడ్ కోడా  చేసుకోవచ్చు.
ఎలా ఎక్కడ ఆ సమాచారం. ఈ కింది లింకు నొక్కి వచ్చిన సమాచారం ప్రకారం మీకు కావలిసినవి డౌన్లోడ్ చేసుకోవచ్చు:
అలనాటి చందమామలు – ధారావాహికలు 
పాత చందమామల డౌన్లోడ్ల విషయంలో యు లిబ్ డాట్ ఆర్గ్ కానివ్వండి మరొక వెబ్సైటు కాని  మునుపు,  చందమామ అభిమానులకు ఎదురైన అనుభవం రీత్యా, ఇప్పుడున్న ఈ ఫైళ్ళు ఎన్నాళ్ళు ఉంటాయో తెలియని పరిస్థితి. కాబట్టి ఆలస్యం దేనికి దారితీస్తుందో అభిమానులకు తెలియనిది కాదు.

2 వ్యాఖ్యలు »

 1. SIVARAMAPRASAD KAPPAGANTU said,

  You have copied word to word from my blog Alanati Chandamamalu wherein I posted the above information under the heading “Subhavarta”. Very sorry to see that you have not given even a simple acknowledgement.

  The information given by me yesterday is in the following link:

  http://alanaatiteluguchandamaama.blogspot.in/2013/04/blog-post.html

  I am not saying that I have given great information. Had you simply given the information about the link wherefrom the serials can be downloaded it would have been something but when you have “copied” what I wrote, its unfair that acknowledgement is not given. I feel very bad.

  • మాకు ఈ సమాచారం అందించడం ముఖ్యం. ఈ మెయిల్లో రచన శాయిగారి ద్వారా మాకిది అందింది. సమాచారం ఆయనదనుకుని ఆయనకు ధన్యవాదాలు చెప్పాం. బహుశా ఆయన మీరాయనకిచ్చిన మెయిల్‍ని మాకు ఫార్వర్డ్ చేసి ఉంటారు. ఆ విషయం గమనించకపోవడం మా పొరపాటు. మీరిచ్చిన సమాచారం నిస్సందేహంగా గొప్పది. విలువైనది. అందుకు మీకు acknowledgments చెప్పకపోవడం అనుకోకుండా జరిగిన పొరపాటు. దాన్ని మీరు కాపీగా భావించడం న్యాయమే. కానీ మీ స్థానంలో మేముండి ఉంటే మొదటి ప్రయత్నంగా దాన్ని కాపీ అనడానికి బదులు పొరపాటని వ్రాసి ఉండేవాళ్లం. అవతలివారి స్పందనని బట్టి కాపీ అని ఉండేవాళ్లం. ఏది ఏమైనా అక్షరజాలం కాపీని హర్షించదని మీకు మరోమారు తెలియబరుస్తున్నాం. ఆ టపాలో మీ బ్లాగుకి acknowledgments జత చేసి ప్రచురిస్తున్నాం. అయినా మీకు అభ్యంతరమైతే తెలియబర్చండి. టపాని తొలగించగలం.
   చందమామ అభిమానులకు శుభవార్తగా మీరందించిన సమాచారానికి అక్షరజాలం అభినందనలు. ఆ శుభవార్తకి పూర్తి credit మీదే. ఈ విషయం స్పష్టం చేస్తూ- జరిగిన పొరపాటుకి మన్నించవలసిందిగా వేడుకుంటున్నాము.
   ఇలాంటి మరిన్ని మంచి వార్తల్ని- అక్షరజాలంతో పంచుకోగలరని ఆశిస్తున్నాం.


Leave a Reply

%d bloggers like this: