మే 11, 2013

రామ్ చరణ్ మానస్- ఠాగూర్ విరచితమా?

Posted in సాంఘికం-రాజకీయాలు at 1:48 సా. by వసుంధర

నిన్న రామ్ చరణ్ మానస్ గురించి చదివారు కదా! ఈరోజు మరో కొత్త అనుమానం. విద్యాధికులైన ఇద్దరు సామాన్యుల్ని కొట్టింది- రామ్ చరణ్ అంగరక్షకులు కాదట. వారు కేంద్రమంత్రి చిరంజీవి సెక్యూరిటీ గార్డ్స్ అట. నిజానికిప్పుడు ప్రత్యేకంగా సెక్యూరిటీ అవసరమైన కొందరు తప్ప- మిగతా మంత్రులెవరికీ సెక్యూరిటీ గార్డ్స్ ఉండరాదని సుప్రీం కోర్టు ఆదేశమున్నదట. మరి ఈ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించడం జరిగిందా? జరిగెనుబో- ఆ రక్షకులు మంత్రిగారి పక్కనుండక- ఓ సినీ హీరో రక్షణకెలా వచ్చారుట? వస్తిరిబో- సామాన్యులపై చేయెందుకు చేసుకున్నారుట? ఈ ప్రశ్నలన్నీనేటి టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటి పుటలో వచ్చాయి. బహుశా మంత్రివర్యులు చిరంజీవి కూడా ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉండి ఉండొచ్చునని ఆ పత్రిక అనుమానాన్ని వ్యక్తం చేసింది. అదే సమయంలో- ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏ హంగూ ఆర్భాటమూ లేకుండా  బయట తిరుగుతూంటారని కూడా తెలిపిందా పత్రిక. సామాన్యుడికోసం జీవితాన్ని పణంగా పెట్టిన ఠాగూర్ పాత్రలో జీవించిన చిరంజీవి ముఖ్యమంత్రి అయితే- సామాన్యుడిదిక ఇష్టారాజ్యం భరతుడి పట్టం కాగలదని కొందరు సంబర పడుతున్నారు. కానీ సామాన్యుడి భరతం పట్టేలా- రామ్ చరణ్ మానస్ రచించగలరన్న అనుమానం కలుగుతోందిప్పుడు.

ధనం, హోదా కలిగించిన మత్తులో ఎంతటివారయినా తప్పులు చెయ్యొచ్చు. ఆ తప్పులు వెంటనే గుర్తించి ఏ షరతులూ లేకుండా క్షమార్పణ చెప్పడం వారిని మహనీయుల్ని చేస్తుంది. లేదూ- వారు శాశ్వతంగా ధనమదాంధులు కాగలరు. నిర్ణయం వారిది. వారి నిర్ణయంమీదనే మున్ముందు ప్రజల నిర్ణయమూ ఆధారపడి ఉంటుంది. వస్తున్నాయ్ ఎన్నికలు!

2 వ్యాఖ్యలు »

  1. tskaladhar said,

    chirajeevi kutumbaaniki prjalapatla unna prema kanna dhana vyamoham adhikamanna sangathi loka viditame kadaaa

  2. TVS SASTRY said,

    ధనం, హోదా కలిగించిన మత్తులో ఎంతటివారయినా తప్పులు చెయ్యొచ్చు.ఎందుకంటే,చట్టం వారి చుట్టమేమో!

    టీవీయస్.శాస్త్రి


Leave a Reply

%d bloggers like this: