జూన్ 2, 2013

శిఖరం- ఈటివి సీరియల్

Posted in టీవీ సీరియల్స్ at 9:16 సా. by వసుంధర

sikharam poster సమకాలీనంగా టివిలలో వస్తున్నడెయిలీ సీరియల్సులో- కథకీ అలోచనకీ ఉన్న ప్రాధాన్యం బాగా తక్కువ. కబుర్లు చెప్పుకుంటూనో. భోజనం చేస్తూనో, నిద్రపోతూనో చూడ్డానికి అనువుగా ఉండే ఆ సీరియల్సుకి కాస్త భిన్నంగా ఉంది నిన్నటితో 228 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న శిఖరం సీరియల్. ఇది ఈ టివిలో సోమ-శనివారాల మధ్య సాయంత్రం 7నుంచి 7.30 దాకా వస్తోంది. కథలో కొత్తదనం ఉంది. ఇందులో కథానాయకుడు ఈశ్వరప్రసాద్‍గా ఆ పాత్రలో హుందాతనంతో జీవిస్తున్న  నాగబాబు- ఈ సిరియల్‍కి నిజంగానే శిఖరం. కథానాయిక అనసూయ పాత్రలో జీవిస్తున్న నటి- అతడికి దీటుగా గొప్పగా నటిస్తోంది. 1967లో వచ్చిన మరపురాని కథ చిత్రంలో వాణిశ్రీ నటనని గుర్తు చేస్తూ అంతటి ప్రతిభనూ ప్రదర్శిస్తున్న ఈ నటిని ఎంతగానైనా అభినందించాలి.   తనకి పిల్లలు కలుగరని తెలిసి భర్తకు గౌతమి అనే మరో యువతితో వివాహం జరిపిస్తుందామె. గౌతమి పాత్రధారిణి ఎంపికను కూడా అభినందించాలి. లేతగా, ముద్దుగా, పరిణతిని ప్రదర్శిస్తూనే అమాయకంగా కనిపించడంలో- ఆమె ప్రతిభ అసామాన్యం. ఇక మిగతా పాత్రలన్నీరొటీన్ కావడం- కొన్ని సన్నివేశాలు కూడా రొటీన్ కావడం బాధాకరమైనా- అనేక సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటాయి.

ఉదాహరణకి గౌతమికి కొన్ని మూఢ నమ్మకాలున్నాయి. తనకి ప్రసవగండం ఉన్నదనీ బిడ్డని కన్నాక తను చనిపోతుందనీ ఆమె గట్టిగా నమ్మింది. ఈశ్వరప్రసాద్ మిత్రురాలైన డాక్టర్ విజయ తన వాక్చాతుర్యంతో గౌతమిని ఆ భావననుంచి బయటపడేయడానికి ప్రయత్నించిన సన్నివేశాలు ఈ సీరియల్‍లో ఇటీవలి హైలైట్శ్.  వాటివల్ల ప్రేక్షకులకు కూడా ఎంతో ప్రయోజనం. ‘సమస్య తలుపు తట్టినప్పుడు ధైర్యం వెళ్లి తలుపు తియ్యాలి. అప్పుడు సమస్య భయంతో పారిపోతుంది’ అన్న డైలాగ్ ఎందరికో ప్రేరణ కాగలదు. ఆ సన్నివేశమున్న ఎపిసోడ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. డాక్టర్ విజయ కౌన్సిలింగ్ అంతకుముందు ఎపిసోడ్‍లో కూడా ఉంది.

ఈ సీరియల్ బుల్లితెరపై కనిపించడానికి కారణమైనవారందరికీ అభినందనలు.

2 వ్యాఖ్యలు »

  1. T.S.Kaladhar sharma said,

    meeru kathalu,serials vrasthu kotha rachayithalaku spoorthinisthooo,
    tv serials,cinemaalu choosthoo vaati paina sadasadvimarshalu chesthunnarante meeru chalaa gopparani cheppali…. yedi yemaina meeku
    naa abhinandanalu.

    • ఏమి చేసినా మా మనసుకి సంతోషంగా అనిపించినదే చేస్తున్నాం. ఆ మేరకు అది మా స్వార్థం. మీ అభిమానానికి ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: