జూన్ 4, 2013

నాట్స్ స్రవంతి ప్రత్యేక సంచిక కోసం…

Posted in సాహితీ సమాచారం at 9:29 ఉద. by వసుంధర

సాహితీ మిత్రులకు,
 
నమస్కారం!  
 
డాలస్ లో జూలై 4,5,6 తేదీల్లో జరుగనున్న నాట్స్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) తృతీయ సంబరాల సందర్భంగా ప్రచురించే “సంబరాల స్రవంతి” ప్రత్యేక సంచిక కోసం రచనల పోటీలు నిర్వహిస్తున్న సంగతి మీకు తెలిసిందే. స్రవంతిలో ఉన్న మూడు విభాగాలలో “భవిత” కోసం ఇంకా రచనల కోసం చూస్తున్నాం. ముఖ్యంగా 18 సంవత్సారాల వయసులోపు ఉన్నవాళ్ళని తెలుగు సాహిత్య ప్రక్రియలు (కథ, కవిత, పద్యం ఇలా) చేపట్టమని ప్రోత్సహిస్తున్నాం. తెలుగు నేర్చుకొనే చదివే పిల్లలకి ఇది మంచి అవకాశం. అయిదు ఉత్తమ రచనలకి తలకి $116 చొప్పున బహుమతులు ఇస్తున్నాము. మీరు సాహిత్య ప్రియులు కాబట్టి, మీ కుటుంబాలలో కానీ, మిత్రబృందంలో కానీ, చురుకైన పిల్లలు ఉంటే వారిని వ్రాయమని ప్రోత్సహించండి. ముఖ్యంగా ఆలోచన వారిది అయి ఉండాలి. పెద్దలు కాస్త సహాయం ఎలాగూ చేస్తారు. వారి మేధలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, అవి ప్రపంచానికి చూపెడదామని ఈ తపన. దయచేసి మీరు కాస్త సమయం వెచ్చిస్తే, మనమందరం, ఈ స్రవంతి ద్వారా తెలుగు సాహిత్య భవితకి చిన్న అద్దం పట్టినవాళ్ళం అవుతాము.
 
రచనలు జూన్ నెల ఏడు/పది తేదీలలోపు nats.sravanthi@gmail.com ఈమెయిలుకు పంపమని మనవి.
 
ధన్యవాదాలు!
 

-మీ నాట్స్ సంబరాల స్రవంతి జట్టు

Leave a Reply

%d bloggers like this: