జూన్ 7, 2013

యంగిస్థాన్, ఓపెన్ హార్ట్- ఎబిఎన్ ఆంధ్రజ్యోతి

Posted in సాంఘికం-రాజకీయాలు at 1:23 సా. by వసుంధర

వార్తాప్రసారాల టివి ఛానెల్సులో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి అనుసరిస్తున్న ఆసక్తికరమూ, ప్రయోజనాత్మకమూ అయిన పంథా మెచ్చుకోతగ్గది. విద్యార్థులలో సమకాలీన సమాజంపట్ల అవగాహనకోసం ప్రతి సోమవారం సాయంత్రం ఆ ఛానెల్లో యంగిస్థాన్ అనే కార్యక్రమం వస్తుంది. ఈ జూన్ 2న వచ్చిన కార్యక్రమం (ఒకటవ భాగం, రెండవ భాగం) శ్రీ మేధా విద్యాసంస్థల ఆవరణలో జరిగింది.  చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు, అందులో అవకాశాలూ గురించిన ఈ చర్చకు  యండమూరి వీరేంద్రనాథ్ ముఖ్య అతిథి. ఈ కార్యక్రమం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఈ కార్యక్రమంపై చార్టర్డ్ అకౌంటెన్సీపై పట్టు ఉన్న శశికుమార్ అనే ఒక ప్రేక్షకుడు తీవ్రంగా ప్రతిస్పందించడం జరిగింది. మాకు ఆ అంశంపై ఉన్న అవగాహన చాలా తక్కువ. శశికుమార్ అభిప్రాయాలను మీ అవగాహన, విశ్లేషణ, ప్రతిస్పందనకోసం ఇక్కడ అందజేస్తున్నాం.

ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో ఈ జూన్ 1న శ్రీ రాధాకృష్ణ ప్రముఖ నటుడు నాగబాబుని (ఒకటవ భాగం, రెండవ భాగం) ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన విశేషాలున్నప్పటికీ ప్రయోజనాత్మకం అనిపించే వివరాలేం లేవు. ఇటీవల వార్తల్లోకెక్కిన రామ్ చరణ్ తేజ సెక్యూరిటీ గార్డ్స్ ఉదంతాన్ని ఆయన పక్కనపెట్టిన విధానం లబ్దప్రతిష్ఠుల స్థాయిలో లేదు. 

ఐతే ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో మళ్లీ మళ్ళీ వినాలనిపించేవీ, సాహిత్యపరంగానూ ప్రయోజనాత్మకమైనవీ ఎన్నో వస్తున్నాయి. వాటిలో ఈ మార్చి 10న వచ్చిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి కార్యక్రమం సాహితీప్రియులందరూ విని తీరాల్సినది. ఆ కార్యక్రమం రెండు భాగాలకోసం- (ఒకటవ భాగం, రెండవ భాగం) ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

Leave a Reply

%d bloggers like this: