జూన్ 14, 2013

రంజని – రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథానికల పోటీ

Posted in కథల పోటీలు at 8:21 సా. by వసుంధర

ఈ క్రింది సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు
 రంజని సంస్థ (ఏ.జి. ఆఫీసు, తెలుగు సాహితీ సమితి) ఈ యేడాది రంజని – రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథానికల పోటీ నిర్వహిస్తోంది. తెలుగువారి జీవితం, సంప్రదాయాలు ఆధారంగా రాసిన సొంత కథానికల్ని రచయితలు జులై 12 వ తేదీ లోపు అందేలా పంపించాలి.
ఈ కథానికలు చేతిరాతలో పది పేజీలు, డి.టి.పి లో ఐదు పేజీలు దాటకూడదు. మొత్తం 20 వేల రూపాయల బహుమతి సొమ్ము. మొదటి, రెండవ బహుమతులకు వరసగా ఆరువేలు, ఐదు వేల రూపాయలు, మూడు, నాలుగు బహుమతులకు 4 వేలు, 3 వేలు. ఐదో బహుమతికి 2 వేలు ఇస్తారు. హామీ పత్రం విధిగా పంపాలి. ఫోన్ నెంబరు, చిరునామా, పేరు కూడా హామీపత్రం మీదే రాయాలి. కథానిక మీద ఎక్కడా పేరు వివరాలు రాయకూడదు.
మట్టిగుంట వెంకట రమణ, ప్రధాన కార్యదర్శి, రంజని, తెలుగు సాహితీ సమితి, ఏ.జి. ఆఫీసు, లకడీకాపూల్, హైదరాబాదు – 500 004 చిరునామాకు కథానికల్ని పంపించాలి. ఇతర వివరాలకు సెల్ నెంబర్లు 9030000696, 9396840890 లకు సంప్రదించాలి.

Leave a Reply

%d bloggers like this: