జూన్ 14, 2013

విమలాశాంతి సాహిత్య పురస్కారం

Posted in సాహితీ సమాచారం at 8:27 సా. by వసుంధర

ఈ క్రింది సమాచారం అందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు
విమలాశాంతి సాహిత్య పురస్కార రచనలకు ఆహ్వానం
 
’శాంతి రజనీకాంత్ స్మారక కథా పురస్కారం’ పేరుతో ఈ ఏడాది ఉత్తమ కథా సంపుటానికి విమలాశాంతి సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో ఉత్తమ కథా సంపుటాలను పంపించాలని విమలా శాంతి సాహిత్య సాంఘిక సేవా ట్రస్టు రచయితలను ఆహ్వానిస్తోంది. ఈ పురస్కారం కింద 10 వేల రూపాయల నగదు, జ్ఞాపిక అందజేసి పురస్కార గ్రహీతను సముచిత రీతిని సత్కరిస్తారు.
 
2011 జనవరి నుండి 2012 డిసెంబరు మధ్య కాలంలో ప్రచురించిన కథా సంపుటాలను మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తారు. రచన సమకాలీన సామాజిక జీవితాన్ని చిత్రించినదై ఉండాలి. రచయితలు తమ తమ కథా సంపుటాలను 2013 జూలై 15వ తేదీ లోపు అందేలా ఈ కింది చిరునామాకు పంపాలి.
 
డా. అంకే శ్రీనివాస్, తెలుగు లెక్చరర్, కేరాఫ్ డి. జయనారాయణ, జనరల్ స్టోర్స్, డోర్ నెం 1/325, నీలిమా థియేటర్ ఎదురుగా, 1వ రోడ్డు, అనంతపురం. ఇతర సమాచారానికి 9533122329 నంబరుకు సంప్రదించాలి.

1 వ్యాఖ్య »

  1. మీరు బ్లాగ్ వరల్డ్ లో జాయినవ్వండి. విసృతమైన ప్రచారం మీ బ్లాగుకు కల్పించుకోండి.
    http://ac-blogworld.blogspot.in/


Leave a Reply

%d bloggers like this: