జూన్ 20, 2013

కథలు, పద్య కవితల పోటీ

Posted in కథల పోటీలు at 11:13 ఉద. by వసుంధర

ఈ క్రింది సమాచారం పంపిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు.

కథలు, పద్య కవితల పోటీ
గుర్రం జాషువా118వ జన్మదినం (28.9.13) సందర్భంగా ఆగస్టు 27, 28 తేదీలలో- రవీంద్ర భారతిలో జయంత్యుత్సవాలు జరుపుతున్నాం. ఈ సందర్భంగా జాషువా
ఆశయాలు, కుల పీడన, దళిత సంవేదన, దళిత రాజ్యాధికారం తదితర అంశాల మీద సామాజికత ఉన్న కథలను, పద్య కవితలను రచయితలు, కవుల నుండి
ఆహ్వానిస్తున్నాం. 25 కథలకు బహుమతులివ్వడమే కాకుండా సంకలనంగా తీసుకొస్తాం. యాభై పద్య కవితలను సంకలనం చేస్తాం. చివరి తేదీ జూలై 31.
రచనలు వివిధ ప్రాంత మాండలికాల్లోనూ ఉండవచ్చు. హామీపత్రం మీద మాత్రమే రచయిత వివరాలు రాయాలి.

కథలకు వరుసగా మొదటి బహుమతి పదివేలు, రెండవది 6 వేలు, మూడవది 4 వేలు, రెండు కన్సోలేషన్ బహుమతులకు రెండేసి వేలు.

ఎంపికైన 20 కథలకు వెయ్యేసి రూపాయలు ఇస్తాం. అలాగే పద్య కవితలకు ఐదు, మూడు, రెండు వేలు; ఏడుగురికి 1500 చొప్పున కన్సోలేషన్ బహుమతులు.

ఎంపికైన 40 కవితలకు వెయ్యేసి రూపాయలు ఇస్తాం.

ఇట్లు
కన్వీనర్, జాషువా పరిశోధన కేంద్రం, తెలుగు అకాడమి, హిమాయత్‌నగర్,
హైదరాబాద్-29 ఫోన్: 040 23220244
– ఆచార్య కె.యాదగిరి, సంచాలకులు, తెలుగు అకాడమి

Leave a Reply

%d bloggers like this: