జూన్ 20, 2013
దాశరథిపై కవితలకు ఆహ్వానం
ఈ క్రింది సమాచారం పంపిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్కి ధన్యవాదాలు.
దాశరథిపై కవితలకు ఆహ్వానం
తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ‘తెలంగాణ భారతి-మహాకవి దాశరథి’అన్న అంశం మీద ఆగస్టు 12, 13 లలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ‘దాశరథికి కవితా నీరాజనం’ ప్రత్యేక సంచికకు దాశరథి జీవితసాహిత్య వ్యక్తిత్వాలు వస్తువుగా పద్య గేయ వచన కవితలను ఆహ్వానిస్తున్నాం. అలాగే దాశరథి గూర్చి కవి పండిత విమర్శకులు రాసిన వ్యాసాలు, సమీక్షలు,వ్యాఖ్యలు, కవితల జిరాక్స్ ప్రతులను, దాశరథి లేఖలను ఆహ్వానిస్తున్నాం.
చివరితేది జూలై 15.
చిరునామా: అమ్మంగి వేణుగోపాల్ 11-9-130/3
లక్ష్మీనగర్ కొత్తపేట, పోస్ట్: సరూర్‌నగర్ హైదరాబాద్-35 లేదా
ammangivenugopal1948@gmail.com
– డాక్టర్ గంటా జలంధర్‌రెడ్డి
సదస్సు సంచాలకులు 9848292715
Leave a Reply