జూన్ 20, 2013

రావూరి అభినందన సంచిక – రచనలకు ఆహ్వానం

Posted in సాహితీ సమాచారం at 12:14 సా. by వసుంధర

ఈ క్రింది సమాచారం పంపిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు.

రావూరి అభినందన సంచిక – రచనలకు ఆహ్వానం
1943లో ‘వీరగాథ’ నవల ద్వారా సాహిత్యలోకంలోకి అడుగుపెట్టిన రావూరి భరద్వాజ జ్ఞానపీఠ పురస్కారం స్వీకరిస్తున్న సందర్భంగా, ఈ 70 ఏళ్ల కాలంలో వారి
రచనలపై వచ్చిన వ్యాసాలు, ఇంటర్వ్యూలు, ఉత్తరాలు, అరుదైన ఫోటోలు తదితరాలన్నిటినీ ఒక గ్రంథ రూపంలో రావూరి 87వ జన్మదినాన (జూలై 5) ‘అభినందన సంచిక’గా తీసుకురావాలని సంకల్పించాం. కావున భరద్వాజ మిత్రులనుంచి రచనలను ఆహ్వానిస్తున్నాం. రావూరి 189 పుస్తకాలలో తొలినాటి కొన్నిరచనలు లభించటం లేదు. ఎవరివద్దనున్నా జిరాక్స్‌ను జూన్ 20 వరకు

బొగ్గుల శ్రీనివాస్, 12-13-677/40, స్ట్రీట్ నెం.1, కమిటీ కాలని. తార్నాక, హైదరాబాద్-17 ఫోన్: 9246551144  చిరునామాకు పంపగలరు.
– బొగ్గుల శ్రీనివాస్
సంపాదకుడు, రావూరి భరద్వాజ అభినందన సంచిక

Leave a Reply

%d bloggers like this: