జూలై 14, 2013
అన్నాదురై టిఎన్ 07 ఏఎమ్ 5758
ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని శ్రీశ్రీ అంటే, ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని మనకి అనిపిస్తోంది.
మన దేశ దౌర్భాగ్యానికి మనం కొంత కారణమైతే మన నాయకులు కొంత కారణం. మనమెలా ఉండాలో తెలుసుకుందుకూ, మనం నాయకులకు బదులు ఎవరిననుసరించాలో తెలుసుకుందుకూ- ఈరోజు ఈనాడు ఆదివారంలో వచ్చిన ఆటోవాలా అన్నాదురై కథ తెలుసుకుని తీరాలి.
‘ఆటో ఎక్కాలంటే చాలామంది భయపడుతుంటారు. ఎక్కువ డబ్బులు తీసుకోవడం, ఆటోడ్రైవర్ల దురుసుతనమూ… ఇలా ఎన్నో కారణాలు. దాన్ని పోగొట్టి, నా పరిధిలో తోటివాళ్లకు సాయం చేయాలనుకున్నాను. ఒక ఆటోడ్రైవర్నైన నేనే ఇంత చేయగలిగితే… నాకంటే పెద్దస్థాయివాళ్లు ఇంకెంత చేయవచ్చో ఆలోచించండి. ఇది నా గురించి నేనేదో గొప్పగా చెబుతున్నదికాదు… విూరూ తోటివారికి సాయపడితే అందరూ సంతోషంగా ఉంటారని నా ఉద్దేశం’ అని వినమ్రంగా చెబుతాడు అన్నా.
స్ఫూర్తిదాయకమైన ఆ కథనాన్ని సేకరించి అందించిన ఈనాడు పత్రికకి అభినందనలు. ఆ వివరాలకు ఇక్కడ, లంకెకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
moorthy said,
జూలై 14, 2013 at 1:53 సా.
maatalu chalavu mechhukovadaniki. manam nerchukovadaniki chala vundi ani thelusukovali