జూలై 20, 2013

మనిషి-జంతువు-మనిషి

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:30 సా. by వసుంధర

photo 15జంతుజాలంలో- ఏ జంతువునైనా లొంగదీసి తన అవసరాలకూ, సేవలకూ ఉపయోగించగల తెలివి, నేర్పు, సామర్ధ్యం మనిషి ప్రత్యేకత. తనకున్న తెలివి లేని మనుషుల్ని కూడా జంతువులకు లాగే ఉపయోగించడం మనిషి అలవాటు. మనుషుల్లో మహాత్ములు భూతదయను ప్రబొధించినా అనేకులు జంతువుల పట్ల కౄరత్వాన్ని ప్రదర్శించడం జరుగుతోంది. వారిలో కొందరు మనుషుల పట్ల కూడా అంత కౄరంగానూ ఉంటున్నారు. అలాంటివారు తాము కౄరంగా ఉండడమే కాక- మరెందరినో అలాంటి కౄరత్వానికి  ప్రేరేపిస్తున్నారు. ఫలితంగా మనిషీ మనిషీ కలిసుండడం కష్టమవుతోంది. 

దక్షిణాఫ్రికాలో ఓ వనపాలకుడు- అక్రమ వేటగాళ్ల బారినుంచి కౄర జంతువులను రక్షించే బాధ్య్తత చేపట్టాడు. అతగాడు కౄరజంతువులతో వ్యవహరిస్తూ వాటిలో ఒకడుగా కలిసిపోయిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పై ఫొటోతో సహా మరికొన్ని ఫొటోలు జతపరుస్తూ- శ్రీదేవీ మురళీధర్- ఈ సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా అందజేశారు. వారికి ధన్యవాదాలు.

అంతలా కౄరమృగాలతో కలిసిపోవడం సాధ్యమయినప్పుడు- మనిషికి మనిషితో స్నేహభావం సాధ్యం కాదా అన్న వ్యాకులంతో ముగిసిన ఈ కథనం పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

1 వ్యాఖ్య »

  1. TVS SASTRY said,

    ఈ జనారణ్యంలో సంచరించే అతి క్రూరమైన జంతువు మనిషే!మంచి సందేశాన్ని చక్కని చిత్రాల ద్వారా అందించిన శ్రీమతి శ్రీదేవి మురళీధర్ గారికి అభినందనలు.

    టీవీయస్.శాస్త్రి


Leave a Reply to TVS SASTRY Cancel reply

%d bloggers like this: