ఆగస్ట్ 1, 2013

పాడుతా తీయగా

Posted in పాడుతా తీయగా at 10:24 సా. by వసుంధర

paduta teeyagaసంస్కృతికి ప్రతిబింబంగా, సంస్కారానికి మారు పేరుగా, అభిరుచి అభినందనీయంగా- ఈటివి ద్వారా అందర్నీ అలరిస్తున్న సంగీత కార్యక్రమం పాడుతా తీయగా. హితుడు, సన్నిహితుడు, మార్గదర్శకుడుగా మన బాసు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరు అనన్యసామాన్యం. తాజా కార్యక్రమంలో బాల గంధర్వుల ప్రతాపం ప్రేక్షకుల్ని కొన్ని మాసాలుగా వశపర్చుకున్న విషయం అందరికీ తెలిసినదే. భాషాజ్ఞానంలో, ఉచ్చారణలో, భావప్రకటనలో, సుస్వర సంగీత ప్రతిభలో- బాలల్లో ఇంతటి ప్రతిభగలవారున్నారని తెలిసి- మన లలిత సంగీతపు భావిపట్ల ఉత్సాహం కలుగుతుంది. గత సోమవారం నాడు ఈ విడత చరమాంకంలో పరమేశ్వరరావు (ప్రథమ బహుమతి ౩ లక్షలు), శ్రీలలిత (ద్వితీయ బహుమతి లక్ష), సుదీప్ (తృతీయ బహుమతి 50 వేలు), షణ్ముఖప్రియ (చతుర్థ బహుమతి 50 వేలు) పాల్గొన్నారు. ఈ నలుగురూ పోటాపోటీగా వినిపించిన పాటలు గొప్పతనంలో అసలుకి  కొసరు జత చెయ్యడం విశేషం. బాసు నిర్వహణకు ముఖ్య అతిథి కీరవాణి సమక్షం కార్యక్రమానికి ప్రత్యేక అలంకారమై భాసించింది. కీరవాణి చెప్పిన విశేషాలు అపురూపమైతే- చివర్లో ఆయన వినిపించిన పద్యాలు మరపురానివి. మహాకవి గుర్రపు జాషువా వ్రాసిన పద్యాలకు ఘంటసాల విభిన్న మనోహర రాగాలలో గానం చేసిన పద్యాల గురించి వివరించి తన గొంతులో వినిపిండం కార్యక్రమానికే హైలైట్. ప్రతి ఒక్కరూ చూసి, విని, అనందించాల్సిన ఈ కార్యక్రమం చూడ్డానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: