ఆగస్ట్ 12, 2013

కథల పోటీ- కథాకేళి

Posted in కథల పోటీలు at 10:57 ఉద. by వసుంధర

ఈ క్రింది సమాచారం పంపిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు.

కథాకేళి దీపావళి కథానికల పోటీ
 
డా. వేదగిరి రాంబాబు కథానికా ప్రస్థానం 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందార్భంగా ’వేదగిరి కమ్యూనికేషన్స్’ సౌజన్యంతో కథాకేళి దీపావళి కథానికల పోటీ
 
మొదటి బహుమతి: రూ 10,000/-
రెండొవ బహుమతి: రూ 8,000/-
మూడవ బహుమతి: రూ 6,000/-
కన్సొలెషన్ బహుమతులు (3): రూ 1,000 (ఒక్కొక్కటి)
కథానికలు పంపడానికి చివరి తేది: 31-08-2013
 
ముఖ్య నిబంధనలు
 
కథానికలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి. అనువాద కథానికలు అనుమతించబడవు.
కథానికలు A4సైజులో లేదా అరఠావు సైజు కాగితాలపై కొట్టివేతలు లేకుండా నీట్ గా వ్రాసి పంపించాలి. కాగితానికి రేండు వైపులా నిరభ్యంతరంగా వ్రాయవచ్చు. జిరాక్స్ లు అనుమతించబడవు. డి.టి.పి టైపింగ్ చేయించి పంపేవాళ్ళు ప్రూఫ్ రీడింగ్ విషయంలో శ్రద్ధ వహించాలి.
కథానికిల నిడివి విషయంలో ఏ విధమైన పరిమితులూ లేవు.
ఒక రచయిత(త్రి) ఒకటి కన్నా ఎక్కువ కథానికలను కూడా పంపించవచ్చు
నిత్యజీవితంలో జరుగుతున్న సంఘటనలను ఇతివృత్తంగా తీసుకొని, సమాజానికి చక్కటి సందేశం ఇచ్చే కథానికలకు; మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా, విజ్ఞానదాయకంగా ఉండే కథానికలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.
హామీ పత్రం వివరాలు మామూలే. తమ పేరు చిరునామాలను హామీ పత్రంపై మాత్రమే వ్రాయాలి. కథానిక వ్రాతప్రతిపై వ్రాయకూడదు. కవరు పైన “దీపావళి కథానికల పోటీకి” అని వ్రాయాలి.
మిగిలిన వివరాలకు, నిబంధనలకు కథాకేళి తాజా సంచిక (ఆగష్టు) చూడగలరు.
కథానికలను ’కథాకేళి’, క్రిసెంట్ పబ్లికేషన్స్, 29-25-43ఎ, వేమూరివారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ – 520 002 అనే చిరునామాకు పంపించాలి.

4 వ్యాఖ్యలు »

  1. నిజమే!
    నమస్సులతో..
    ఆర్.దమయంతి.


Leave a Reply

%d bloggers like this: