ఆగస్ట్ 15, 2013

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు

Posted in బాల బండారం at 11:46 ఉద. by వసుంధర

1954-57 మధ్యలో నేను నవభారతి గురుకుల్ రెసిడెన్షియల్ హైస్కూల్‍లో 9-11 తరగతులు చదివాను. రాజమండ్రిలో ఆల్కట్ గార్డెన్సులో ఐఎల్‍టిడి కంపెనీ పక్కన ఉండే ఆ బడిని వ్యవస్థాపకులు శ్రీ తన్నీరు బుల్లెయ్య నిర్వహించిన తీరు అనుభవైకవేద్యం. ఆ బడిలో బాలల మానసిక వినోద వికాసాల కోసం ఎన్నో ఏర్పాట్లుండేవి.  ఆ వివరాలు మరొకసారి. 

picture bv narasimharao

బాలబంధు శ్రీ బి.వి. నరసింహారావు గురించి నాకు తెలిసినదక్కడే. కనీసం ఏడాదికొక్కసారైనా ఆయనికొచ్చి తన మాటలతో, పాటలతో, ప్రబోధాలతో- మాకు ఉల్. లాసాన్నీ, ఉత్సాహాన్నీ కలిగించి ఉత్తేజపరిచేవారు. అక్కడ చదువుకునేవారమంతా ఏటా ఆయన రాక కోసం ఎదురుచూసేవాళ్లం. ఆయన కవితల్లో నన్నె అంటావు కానీ నాన్నను అనవేమి అమ్మా- అన్ని తెల్ల కాగితాలు అలా పాడు చేస్తుంటే అన్నది ఆయన నోట పలకగానే వినాలి. ‘జయకృష్ణా ముకుందా మురారీ’ పాటని ఘంటసాల నోటనే వింటే కలిగే అనుభూతి వంటిదది. అప్పట్లో నన్నాకర్షించి ఇప్పటికీ గుర్తుండిపోయిన ఓ పాటని ఇక్కడ ఉదహరిస్తున్నానుః

అవ్వ చేతిలో గువ్వ

గువ్వ కాలికొక మువ్వ

మువ్వ ఖరీదొక రువ్వ

రువ్వకు బియ్యం తవ్వ

తవ్వ బియ్యంతొ బువ్వ

గురుకులం వదిలేక మళ్లీ వారి గురించి వినలేదు. వారిని తరచు ఇప్పటికీ తలచుకుంటూనే ఉంటాను. ఈ రోజు వారి శత జయంతి సందర్భంగా బాల సాహిత్య పరిషత్ అధ్యక్షులు శ్రీ చొక్కాపు వెంకటరమణ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వారి గురించి వ్రాసిన వ్యాసం చదవగానే అపరిమితానందం కలిగింది. ఇటువంటి మహనీయుల్ని సంస్మరించిన బాల సాహిత్య పరిషత్ ధన్యం. శ్రీ రమణ అభినందనీయులు.

వారి పాటలు వారి వరసలతో వారి గొంతులోజనంలోకి వెడితే ఎంతో బాగుంటుంది. అది సాధ్యం కాకపోతే అవి ఇతరుల గొంతులోనైనా అందరికీ అందుబాటులోకి రావాలని మా కోరిక. 

రాజకీయ వాసనలు లేనివారి జన్మదినాలకు వేడుక చేసుకునే సత్సంప్రదాయం మనకి లేదనేమో- యావత్ దేశమూ తన జన్మదినాన్ని వేడుకగా జరుపుకునేలా- ఆగస్ట్ 15న ఈ భూమ్మీద అవతరించారు మన బాలబంధు. వారికి నివాళులర్పిస్తూ- శ్రీ చొక్కాపు వెంకట రమణ వ్యాసాన్ని ఇక్కడ జతపరుస్తున్నాం.

picture bv v

4 వ్యాఖ్యలు »

  1. Shri said,

    చాలా ఉపయుక్తమైన టపా .. నరసింహారావు గారి వంటి వ్యక్తులు బాలలకు చిరస్మరణీయులు

    శ్రీదేవి


Leave a Reply

%d bloggers like this: