ఆగస్ట్ 16, 2013

షాడో- ఒక స్పందన

Posted in వెండి తెర ముచ్చట్లు at 5:31 సా. by వసుంధర

shadow భారీ తారాగణంతో భారీ వ్యయానికి ఓర్చి తీసిన భారీ చిత్రంగా పేరుపడ్డ షాడోని థియేటర్లో చూద్దామనుకునేలోగానే వెళ్లిపోయింది. నిన్న స్వ్తతంత్రదినం సందర్భంగా జెమిని టివిలో సాయంత్రం 4 గంటలకి ఈ చిత్రం వస్తే ఎంతో ఆసక్తిగా చూశాం.

లెక్కలు బొత్తిగా రానివారికి ఎంత శిక్షణ ఇచ్చినా, ఎన్నిమార్లు పరీక్ష వ్రాయించినా వచ్చే మార్కుల్లో మార్పుండదు. మన సినీ దర్శకుల్లో ఎక్కువమందికి సినిమా అంటే రాని లెక్కలకి ప్రయత్నించడమే అనిపిస్తుంది.

కథ పూర్వం ఎందరో వాడేసినది. అయినా ఎన్నో సందేహాలు. సమీక్ష ఒకటి, రెండు చదవండి. ఈ చిత్రంలో వెంకటేష్ బలవంతాన తన పాత్రని పోషించినట్లు తోస్తుంది. తాప్సీ నటనకి తప్ప దేనికైనా రెడీ అన్నట్లు కనిపించింది. ఆదిత్య పంచోలీ- కొత్తగా నటనావకాశం లభించిన ఔత్సాహిక నటుడి తాపత్రయంతో పరిణతి చూపలేకపోయారు. శ్రీకాంత్, గీత ఆయా పాత్రలకి వృథా. ఎమ్మెస్ నారాయణని ఈ చిత్రంలో చూసినవారెవ్వరూ- ఆయనకి ఐదు నిముషాలకు మించిన పాత్రలు ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఈ చిత్రంలో ఈ నటీనటుల్నిచూసినా- ఏమున్నది గర్వకారణం? చిత్ర, సంగీత దర్శకులు పూర్తిగా విఫలమైన ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి, వెంకటేష్, తాప్సీ, ఎమ్మెస్ నారాయణల మధ్య నడిచిన పది నిముషాల ప్రహసనం ఒక్కటి కాస్త కొత్తగా, తెలివిగా అనిపించి కాస్త అలరిస్తుంది. మిగతా చిత్రమంతా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడమే ఉద్దేశ్యంగా తోస్తుంది. మాకులాగే సినిమా బాగోగులతో నిమిత్తం లేకుండా- వాటిని పరిశీలించాలన్న సరదా ఉన్నవారికోసం ఇక్కడ కొన్ని లంకెలు.

ఆడియోలో పాటలు  దృశ్యాల మచ్చు  విడియోలో పాట మచ్చు

 


మాకులా

 

Leave a Reply

%d bloggers like this: