ఆగస్ట్ 19, 2013

తొలి తెలుగు కథ

Posted in సాహితీ సమాచారం at 11:28 ఉద. by వసుంధర

రస హృదయులు కథలు చదివి ఆనందిస్తారు. విమర్శకులు కథల్లో లొతుపాతుల్ని విశ్లేషిస్తారు. సాహిత్యాభిమానులు కథల చరిత్రను శోధిస్తారు. ఆధునిక యుగంలో తొలి తెలుగు కథ ఏదన్నది కొంతకాలంగా అందర్నీ ఆకర్షిస్తున్నఅంశం. చాలామంది గురజాడ ఫిబ్రవరి 2010లో ఆంధ్రభారతిలో ప్రచురించిన దిద్దుబాటు కథని తెలుగులో తెలుగు కథగా భావిస్తారు. ఈ విషయమై భిన్నాభిప్రాయులు ఉండడం వల్ల- శ్రీకాకుళంలోని కథానిలయం ట్రస్టు తొలి తెలుగు కథ పేరిట ఏడు అభిప్రాయాలతో 60 పేజీలతో ఒక చిన్నపుస్తకాన్ని ప్రచురించింది. ఆ ప్రకారం గురజాడ కంటే ముందు కనీసం ఐదు కథలు వచ్చాయి. భండారు అచ్చమాంబ 1902లోనే ధనత్రయోదశి (హిందూ సుందరి నవంబర్ సంచికలో), స్త్రీవిద్య అనే మరో కథనూ ప్రచురించారు. మిగతా మూడూ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మవిః లలిత (కల్పలత- నవంబర్ 1903), విశాఖ (కల్పలత- అక్టోబర్, నవంబర్ 1904), విశాఖ-2 (కల్పలత 1904). ఆ తర్వాత గురజాడ వారి దిద్దుబాటు. ఆ తర్వాత వచ్చిన మాడపాటి హనుమంతరావు హృదయ శల్యము (ఆంధ్రభారతి- జనవరి 1912) కథను తొలి తెలుగు కథగా పరిగణించిన వారున్నారు.  కొందరు తేదీలను బట్టి నిర్ణయిస్తే, కొందరు రచన లక్షణాలను బట్టి కథగా నిర్ణయించి ఒక అభిప్రాయానికొచ్చారు.

ఈరోజు ఆంధ్రజ్యోతిలో (లంకెకు ఇక్కడ క్లిక్ చెయ్యండి) షేక్ మహబూబ్ బాషా– ఇచ్చిన సమాచారం ప్రకారం- తొలి తెలుగు కథ వ్రాసినది నిస్సందేహంగా భండారు అచ్చమాంబ అనే అనుకోవాలి. అదీ 1898లో. అవీ ఒకటి కాదు, రెండు కథలు. అంటే ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మకంటే ముందుగా ఆమెవి కనీసం నాలుగు కథలు ప్రచురితమయ్యాయి. 1898లో ఆమె వ్రాసిన రెండు కథల్నీశ్రీ బాషా విపులంగా చర్చించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలర్పిస్తూ, ఆ వ్యాసాన్నిక్కడ పొందుపరుస్తున్నాం.

stories by bandaru achchamamba aj 19 08 13

Leave a Reply

%d bloggers like this: