సెప్టెంబర్ 5, 2013

Posted in సాంఘికం-రాజకీయాలు at 11:40 ఉద. by వసుంధర

 

 

భారత రత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతి గర్వించతగ్గ భారతీయుడు. జ్ఞానానికి, విలువలకు సమాన ప్రతినిధి. నేడు ఆయన 126వ జన్మదినం. బడికి విలువ తెచ్చిన ఆ మహనీయుని జన్మదినం నాడు ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకొనడం మన దేశంలో సంప్రదాయమైంది. చదువు వ్యాపారంగా మారి, గురువులు వ్యాపారస్థులుగా వ్యవహరిస్తున్న ఈ రోజుల్లో ఈ ఆదర్శ గురువుని ఒకపరి సంస్మరించడం భావికి మేలు చేస్తుంది.

మనకి స్వతంత్రం వచ్చినప్పుడు, ప్రజాస్వామ్యానికి తగిన పరిణతి మనకి ఉన్నదా అని అప్పట్లో ఆయన సందేహం వెలిబుచ్చడం వివాదాస్పదమైందని వినికిడి. కానీ ఇప్పుడు మన పరిణతి విషయమై మనకే సందేహమూ కలుగని విధంగా ఉన్నది నేడు మనమెన్నుకున్న నాయకుల తీరు.

మనకి ఎటువంటి నేతలు కావాలో మర్చిపోయాం. ఒక్కసారి రాధాకృష్ణన్ వంటి వారిని సంస్మరించడం మన బుద్ధిని సంస్కరించే అవకాశముంది. నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో శ్రీ గోటేటి రామచంద్రరావు ఆ మహనీయుని సంస్మరించారు. ఆ సంస్మరణకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

 

Leave a Reply

%d bloggers like this: