సెప్టెంబర్ 13, 2013
కరుణాకర్ ఇక లేరు….
(పై బొమ్మ తెలుగు వన్ న్యూస్ సౌజన్యంతో)
కథలకు న్యాయం చేస్తూ, కథకులకు సంతృప్తినిస్తూ, పత్రికాధిపతులకు బాసటగా అనిపిస్తూ, పాఠకులకు రసానుభూతినిస్తూ- గీతల్లో తనకంటూ ఓ బాణీని ఏర్పరచుకున్న ప్రముఖ చిత్రకారుడు కరుణాకర్. ఇంకా అరవై దాటని ఈ అసామాన్యుడు ఈ సెప్టెంబర్ 12న కన్ను మూశారన్న వార్త తెలుగు సాహితిని, పత్రికాలోకాన్ని, పాఠకుల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అభిమానులుగా వారి కుటుంబానికి సంతాపం తెలుపుదాం. తీరని ఆ లోటు మర్చిపోవడానికి వారి బొమ్మల్లో ఆయన ఆత్మను చూసుకుంటూ మనశ్శాంతి పొందుదాం. ఆయనకివే మా నివాళులు.
P V Ramana Murty said,
సెప్టెంబర్ 16, 2013 at 8:51 సా.
నేను అభిమానించే చిత్రకారుల్లో కరుణాకర్ గారు ఒకరు. ఎందరో రచయితల కధలకి వారు వేసిన బొమ్మలు అద్భుతంగా ఉండేవి. ఒక మంచి చిత్రకారున్ని కోల్పోయాము.