సెప్టెంబర్ 25, 2013
అరుదైన అపురూప నాణెం
స్వతంత్ర భారతంలో హిందూత్వం అన్న పదాన్ని ఉచ్చరించడం ఆలౌకికవాదం అనిపించుకోవడం గమనార్హం. అందుకు కారణం ముస్లిములు ఏమాత్రమూ కారు. ఎందుకంటే వారిలో సరస్వతీ వందనం చేసి సంగీత సాధన ప్రారంభించే వారున్నారు. వ్యాస మహాభారతం ఆత్మను పట్టి టివి సీరియల్కి సంభాషణలు రూపొందించి పండిత పామరులను అలరించినవారున్నారు. రామాయణంపై విమర్శలకు సాధికారంగా భాష్యం చెప్పి సమర్థించ గల వారున్నారు. సమస్య ఓట్ల రాజకీయానిది. విభజించి పాలించాలనుకునే నల్ల దొరలది. ఆ సూత్రం తెల్ల దొరలదే అయినా, మనం వారి బానిసలమైనా, ఆ తెల్ల దొరల కారణంలో ముద్రించబడిన ఈ నాణేన్ని (ఈ సమాచారం పంపిన శ్రీదేవి మురళీధర్కి ధన్యవాదాలు) చూడండి.
vinjamur said,
సెప్టెంబర్ 27, 2013 at 10:28 ఉద.
Thank you for the picture . Nice analysis