సెప్టెంబర్ 28, 2013
ఓ పాత సినిమా చిట్కా
హీరో హేరోయిన్ని ఇంప్రెస్ చెయ్యాలి. అమె ఒంటరిగా ఉండగా చూసి ఆమెమీదకి రౌడీల్ని ఉసిగొల్పుతాడు. ఆమె నిస్సహాయంగా ఉన్న సమయంలో తాను వెళ్లి తాను నియమించిన రౌడీల్ని చితకబాది తరిమేస్తాడు. హీరో హేరోయిన్లు ప్రేమలో పడతారు. ఇది పాత సినిమాల్లో తరచుగా కనిపించే ఒక చిట్కా. బాగా పాతబడిందేమోనని సినిమాలు దీన్ని వదిలిపెట్టేశాయి.
నినాదాలైనా, చిట్కాలైనా ఎంత పాతబడితే అంత బాగా ఉపయోగపడతాయి మన రాజకీయవాదులకి. ఎందుకంటే వారి విధానాలన్నీ తిరోగమనం కోసం. నేటి దినపత్రికలో ఈ వార్త చూడగానే స్ఫురించినదిది. లంకెకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆంధ్రజ్యోతి సౌజన్యం ఈ క్రిందకూడా చదవొచ్చు. చదివేక మీకేమనిపించిందో చెప్పండి.
bonagiri said,
సెప్టెంబర్ 29, 2013 at 1:05 సా.
చాలా పాత పార్టీ కదా, అందుకే యమగోల నాటి రావుగోపాలరావు చిట్కా ఉపయోగించారు.
వచ్చే ఎన్నికలలో ప్రజలు వాళ్ళ పార్టీనే “ఫాడ్కే ఫేక్నా” చేస్తారు.