అక్టోబర్ 7, 2013
విభజనలో మట్టి మనుషులు
మన రాజకీయనాదుల్ని ప్రజలు నోరారా అన్నా, అక్కా అని పిలుస్తారు. వాళ్లు ఓ అమ్మ కాని అమ్మ చుట్టూ తిరుగుతూ అమ్మా అమ్మా అని కలవరిస్తూంటారు. తమ్ముళ్లకీ, చెల్లెళ్లకీ తంపులు పెట్టి చోద్యం చూస్తూంటారు. దేశం ముందుకెళ్లినా వెనక్కెళ్లినా మనకి అన్నం పెట్టేది మట్టి పిసుక్కునే రైతు మాత్రమే. తెలుగునాట వివిధ ప్రాంతాలకు చెందిన అలాంటి నలుగురు మట్టి మనుషుల్ని ఒకచొట చేర్చి, ఆ నిష్కల్మష జీవుల రాజకీయ అవగాహన పట్ల మనకు అవగాహన కల్పించే గొప్ప ప్రయత్నం చేసిన ఘనత ఎబిఎన్ ఆంధ్రజ్యోతిది. నిన్న రాత్రి 8.30-10 వచ్చిన ఆ కార్యక్రమాన్ని చూడ్డానికి భాగం 1 భాగం 2 మీద క్లిక్ చెయ్యండి. చదవడానికి ఈ క్రింద చూడండి. ఈ వ్యాసానికి లంకెకి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
hari.S.babu said,
అక్టోబర్ 7, 2013 at 11:13 ఉద.
hats off to common people.