అక్టోబర్ 14, 2013

నేటి కార్టూన్

Posted in చిత్రజాలం at 10:06 సా. by వసుంధర

మా చిన్నప్పుడు ఒక జోకుండేది. మన ట్రయిన్స్ ఎప్పుడూ ఆలస్యమే కదా! ఒకసారి కరెక్టుగా అసలు టైముకి వచ్చేసిందిట. ప్లాట్‍ఫారం మీదున్న కొందరు ఇంజన్ డ్రైవర్ని అభినందించడానికి పరుగున వెళ్లారుట. విషయం విని ఆ డ్రైవర్ మొహమాటపడుతూ, ‘ఇది నిన్నటి ట్రైనండీ’ అన్నాట్ట. మన నియమస్వామ్యం (బ్యూరియోక్రసీ) ఇప్పటికీ ఈ జోక్‍కి ప్రాతిపదికగానే ఉంటున్నది అని అందరికీ తెలుసు. కానీ నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ కార్టూన్ నవ్విస్తూనే మనసునిండా విషాదాన్ని నింపుతుంది. మీతో పంచుకుందుకు- ఈ క్రింద ఇస్తున్నాం.

cartoon oct 13 13

3 వ్యాఖ్యలు »

  1. సంబంధిత అమాత్య, అధికార గణాచారులకు గీతల నీతులు కాదు, వాతలు అవసరం.


Leave a Reply

%d bloggers like this: