అక్టోబర్ 23, 2013

అలనాటి చిత్రసీమ విశేషాలు

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:56 సా. by వసుంధర

ఆరేడేళ్ల వయసులో 1950లో రామచంద్రపురంలో లక్ష్మీ థియేటర్లో చూశాను లక్ష్మమ్మ కథ. తెరమీద కదిలే బొమ్మల్ని చూడ్డం ఒక అద్భుతానుభవమైన రోజులవి. కానీ ఆ వయసులోనే ఆ చిత్రానికి సంబంధించిన వివాదాస్పద వివరాలు నాకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఆ చిత్రంలో సిహెచ్ నారాయణరావు, కృష్ణవేణి, రుక్మిణి నటిస్తే- దానికి పోటీగా అదే కథతో నాగేశ్వరరావు, అంజలి, జి. వరలక్ష్మిలతో శ్రీలక్ష్మమ్మ కథ పేరుతో మరో చిత్రం విడుదలైంది. మొదటి చిత్రంతో పోల్చితే రెండవ చిత్రంలో కనీసం హాస్యంలో కొంత అసభ్యత చొటు చేసుకున్నట్లు అనుకునేవారు. రెండింటిలోనూ- మొదటి చిత్రం హుందాగా ఉన్నట్లూ, ఎక్కువ విజయం సాధించినట్లూ చెప్పుకున్నారు. పదేళ్ల క్రితం కాబోలు లక్ష్మమ్మ కథ చిత్రం చూసినప్పుడు నటన, సంగీతం, దర్శకత్వప్రతిభల పరంగా- ఆ స్థాయి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ చిత్రంలో ఘంటసాల పాడిన శ్లోకమొకటి (అసతోమా సద్గమయ) విన్నప్పుడు- ఆ గొంతులోని తాజాతనం అద్భుతంగా అనిపించింది. ఎంఎస్ రామారావు పాడిన ఇటో ఇటో అటో ఎటుపోవుటో అన్న పాట విని- హిందీలో ముఖేష్ లా ఈ గాయకుడికి ప్రతి చిత్రంలోనూ ఒక విలక్షణ గీతం ఎందుకు లభించలేదా అనిపించింది. ఆ చిత్రం గురించిన కొన్ని ఆసక్తికర విశేషాలు హిందూ పత్రికలో వచ్చాయి. అవి కాక ఆంధ్రజ్యోతి ఆదివారం సెప్టెంబర్ 29 (2013) సంచికలో వచ్చిన ఈ క్రింది వివరాలు కూడా మీతో పంచుకుంటున్నాం.

rukmini aj sep 29 13

2 వ్యాఖ్యలు »

  1. CS Sarma said,

    దీన్ని మెచ్చుకునే వారు మా గ్రూప్లో చాలామంది ఉన్నారు. ఇలాంటివి మున్ముందు మాకోసం పంపగలరు.

  2. Shri said,

    ఎంతో చక్కటి విశేషాలతో పాత జ్ఞాపకాలు అక్షరబద్ధం చేశారు … ఈ పేరు గల చిత్రం గురించి ఇదే వినటం .శ్రీలక్ష్మమ్మ కథ గురించి విని ఉన్నాం .
    ధన్యవాదాలు
    శ్రీదేవి


Leave a Reply to Shri Cancel reply

%d bloggers like this: