అక్టోబర్ 26, 2013
రాజకీయాల్లో అత్తారింటికి దారేది?
చాలా ఏళ్లుగా తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. అది గత సంవత్సరం ఉడృతమై సకల జనుల సమ్మెకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మిగతా ప్రాంతాలూ పట్టించుకోలేదు.
ఉన్నట్లుండి ఈ సంవత్సరం జూలై నెలాఖరులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని ప్రకటించింది. తెలంగాణ ప్రాంతం మురిసిపోయింది. మిగతా ప్రాంతంలో పెద్ద పెట్టున సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.
విభజన కోరుకునేవారిలో కొందరు ఇతర ప్రాంతాల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కొందరు సోదరభావంతో హామీలిచ్చారు. సమైక్యవాదుల్లో కొందరు విభజన కోరేవారితో మాట్లాడకుండా అంతా సహోదరుల్లా కలిసుందామంటున్నారు. కొందరు రాష్ట్రం నష్టపోతుందని వాపోతున్నారు. ఇరు పక్షాలకీ మాత్రం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడాలు లేవు.
సమస్య ప్రజలది. ఉద్యమాలు ప్రజలవి. ఆ ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోకుండా మొత్తం రాజకీయవాదులందరూ ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు.
ఇది బాధాకరమైన విషయమే కావచ్చు. కానీ ఇది పూర్తిగా కామెడీ ట్రాక్‌లా కొనసాగడం దురదృష్టం. అమాయకులైన ప్రజలతో, అలోచనలేని స్వార్థపరులు ఆడుతున్న ఈ నాటకానికి తెర పడేదెప్పుడు?
When exploitation is inevitable relax and enjoy అన్నారు కొందరు విజ్ఞులు. హాస్య వ్యంగ్యాల్లో అంతర్జాల పౌరుల సృజనాత్మక శక్తికి నిదర్శనంగా ఈ విడియో చూడండి.
Leave a Reply