అక్టోబర్ 31, 2013

మాన్యదర్శకుడు ప్రత్యగాత్మ

Posted in వెండి తెర ముచ్చట్లు at 12:53 సా. by వసుంధర

మనకున్న ప్రతిభావంతులైన దర్శకుల్లో కె. ప్రత్యగాత్మ ఒకరు. వారి జయంతి సందర్భంగా నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వ్యాసం చాలావరకూ సమగ్రంగా ఉంది. ఆ వ్యాసానికి అంతర్జాలంలో లంకె ఇస్తూ ఈ క్రింద కూడా పొందు పరుస్తున్నాం. ఐతే ఈ వ్యాసంలో మాకు ఎంతో నచ్చిన పునర్జన్మ (1963) చిత్రం ప్రసక్తి లేకపోవడం ఆశ్చర్యం. ముఖ్యంగా సినిమాలో వచ్చే ముఖ్యపాత్రలను ఆరంభంలో పరిచయం చేసిన కథన విధానం అప్పట్లో మాకు చాలా నచ్చింది. టి చలపతిరావు సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు అప్పట్లో పెద్ద హిట్. మహాకవి శ్రీశ్రీ వ్రాసిన సజీవ శిల్పసుందరీ పాట ఇప్పటికీ పాటల పోటీల్లో తరచుగా వినబడుతూంటుంది. ఈ పాటకు సాహిత్యం– అలనాటి ప్రముఖ సినీ దర్శకుడు వి. శాంతారాం రూపొందించిన స్త్రీ (1961) చిత్రంలో భరత్ వ్యాస్ వ్రాసిన కౌన్ హో తుమ్ కౌన్ హో పాట సాహిత్యానికి చాలా దగ్గిర్లో ఉండడం గమనార్హం. స్త్రీ చిత్రం కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలానికి వెండితెర రూపకల్పన. ఈ చిత్రంలో దుష్యంతుడి పాత్రకుగానూ, ఎన్టీ రామారావుని అడిగి- ఆయన తెలుగులో బిజీగా ఉండి కాదనడంవల్ల- ఆ పాత్రను శాంతారాం తానే ధరించినట్లు అనుకునేవారు. పునర్జన్మ చిత్రంలో వాసంతిది ఒక విశిష్ట పాత్ర. ఆమెపై చిత్రీకరించిన ‘ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళ’ పాట మాకెంతో ఇష్టం. అది అంతర్జాలంలో మాకు దొరకలేదు. శ్రీ ప్రత్యగాత్మకు అక్షరజాలం నివాళులు.

pratyagatma

Leave a Reply

%d bloggers like this: