నవంబర్ 5, 2013

తెలుగు దొర సిపి బ్రౌన్

Posted in భాషానందం, సాహితీ సమాచారం at 12:58 సా. by వసుంధర

cp brown ప్రతి భాషకూ ఒక విభిన్నమైన సాహిత్యం ఉండొచ్చు. ఐనా సాహిత్యానికి ఎల్లలు లేవు. కానీ ఇప్పుడు తెలుగు నాట సాహితీపరులు ప్రాంతాలవారీగా, జిల్లాలవారీగా, ఉద్యమాల వారీగా, ప్రక్రియల వారీగా విడిపోతూ- మహాసముద్రంలాంటి సాహిత్యాన్ని చిన్ని చిన్ని కొలనులుగా విడగొడుతున్నారు. సాహితీప్రియులకు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ సాహిత్యం మహా సముద్రమే. ఇంగ్లండులో పుట్టిన బ్రౌన్ దొర తెలుగు సాహిత్యానికి చేసిన ఎనలేని అసలు సిసలు సాహిత్యసేవ అందుకు తిరుగులేని నిదర్శనం. పై ఫొటో వివరాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. తెలుగు భాషాప్రియుల మనసుల్లో చిరంజీవిగా నిలచిన బ్రౌన్ దొరకి రానున్న నవంబర్ 10కి 215 సంవత్సరాలు నిండుతాయి. ఆ సందర్భంగా కాబోలు-  దూరదర్శన్ సప్తగిరిలో నిన్న (సోమవారం) బ్రౌన్ దొర సాహిత్య సేవలకు సంబంధించిన కార్యక్రమం తెలుగు తోట శీర్షికలో వచ్చింది. అందులో ప్రతి ఒక్కరూ వినదగ్గ మంచి సమాచారం ఉంది. మనకు ప్రేరణ కాగల ఎన్నో విశేషాలున్నాయి. ఆ కార్యక్రమం తిరిగి ఈ రోజు (5-11-2013) రాత్రి 8.30కి పునఃప్రసారం ఔతుంది. వినగలరు. విని అసలుసిసలు సాహిత్యసేవకు నిర్వచనం తెలుసుకోగలరు. 

Leave a Reply

%d bloggers like this: