నవంబర్ 9, 2013

నేటి కార్టూన్

Posted in చిత్రజాలం, సాంఘికం-రాజకీయాలు at 1:11 సా. by వసుంధర

ఎన్నికలొస్తున్నాయి. పరిస్థితిపట్ల అవగాహనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో శేఖర్ నేటి కార్టూన్ (క్రింద ఉంది) అద్దం పట్టింది. కార్టూనిస్టుకి అభివందనాలు. కార్టూన్ చూడగానే వసుంధర మానసమందు తళుక్కుమన్న కవితను కూడా ఇక్కడ ఇస్తున్నాం.

cartoon nov 9

ఏకచక్రపుర వాసులం ఒకే ఓటు ధారులం

మన బాగోగులు చూడగ ముందుకొచ్చు నేతకై  

మన సొమ్ముతొ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ చేసి

అయిదేళ్ల ఒప్పందానికి నిర్ణయాధికారులం

దేవుడు మన ముందుకొచ్చి నేనున్నానని అంటే

శిరసు వంచి వందనమిడి చేతుల్ని జోడించి

ఆలయాన బంధించి హారతిచ్చు అర్చకులం

దనుజుడు మన ముందుకొచ్చి ఇచ్చకాలు చెప్పగానె

నిలువెల్లా పులకరించి జయజయధ్వానాలు పలికి

దారూకే దరువేసే విచక్షణా రహితులం

మననేలే బకాసురుడు సర్వం భక్షిస్తుంటే

నేరం వాడిది కాదు, వాడి ఆకలిది అని

మన ఆకలి మరిచిపోవు మహా సహనశీలురం

ఆయిదేళ్లు గడిచిపోయి మళ్లీ ఎన్నికలొస్తే

మళ్లీ బకాసురుడు ఆవురావురంటుంటే

మళ్లీ వాడి ఆకలికే ప్రాధాన్యమిచ్చు మూసలం

ఏకచక్రపుర వాసులం ఒకే ఓటు ధారులం

Leave a Reply

%d bloggers like this: