నవంబర్ 14, 2013

సినిమా కథల పోటీ- నది మాసపత్రిక

Posted in కథల పోటీలు at 7:03 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ ఈ క్రింది సమాచారం అందజేశారు. వారికి ధన్యవాదాలు.
నది మాసపత్రిక సినిమా కథల పోటీ నిర్వహిస్తోంది.

ప్రథమ బహుమతి: రూ 15,000/-

ద్వితీయ బహుమతి: రూ 10,000/-

తృతీయ బహుమతి: రూ 5,000/-

సాధారణ ప్రచురణకి ఎంపికైన ప్రతి కథకు తగు పారితోషికం ఇవ్వబడును

ముఖ్య నిబంధనలు:

  • రచనలు పంపగోరువారు పుల్ స్కేప్ సైజు లేదా ఎ4 తెల్లకాగితం మీద 8 నుండి 10 అరఠావులకు మించకుండా పేజీకి ఒకవైపే 25 లైన్లకు మించకుండా వ్రాసి పంపాలి. ఎక్కువ పేజీలు పంపిన కథలు పరిశీలించబడవు. జిరాక్స్ కాపీలు అనుమతించబడవు.
  • ఫోన్ నెంబరు, చిరునామా, పాస్ పోర్ట్ సైజు ఫోటోను కథతో పాటు జతపరచవలెను. కథపై ఎటువంటి వ్యక్తిగత వివరాలు ఉండరాదు.
  • ఒకరు ఒక కథ మాత్రమే పంపవలెను.
  • రచయిత(త్రు)లు తమ రచనల్ని “సినిమా కథల పోటీ” C/O “నది” మాసపత్రిక, 26-20-44, అగ్రి గోల్డ్ మల్టీమీడియా బిల్డింగ్, సాంబమూర్తి రోడ్, గాంధీనగర్, విజయవాడ – 520003 చిరునామాకు పంపాలి.
  • మిగిలిన షరతులు షరా మామూలే. పూర్తి వివరాలకు నది మాసపత్రిక నవంబరు సంచిక చూడగలరు.

·         గడువు తేదీ: 31 డిసెంబరు 2013

1 వ్యాఖ్య »

  1. మిత్రులారా, గో తెలుగు వెబ్ మాగ్ వారు కథలపోటీ నిర్వహిస్తున్నారు. గడువు తేదీ 01-12-2013. వివరాలకు ఈ లింక్ ఓపెన్ చేయవచ్చు.
    http://www.gotelugu.com/issue28/home/


Leave a Reply

%d bloggers like this: