నవంబర్ 20, 2013

అమెరికాలో తెలుగు పీఠం

Posted in Uncategorized at 2:08 సా. by వసుంధర

తెలుగు మిత్రులందరికి మా అభివాదములు.

 బర్క్లీ లో ప్రతిష్ఠాత్మకంగా ప్రభవిల్లుతున్న మన తెలుగు పీఠం పురోగతి సమీక్షించటమే ఈ లేఖ ఉద్దేశం.

•                  పీఠం స్థాపనకి ప్రయత్నాలు 2006 లో మొదలయాయి

•                  తెలుగు బోధన 2007 లో మొదలయింది

•                  ఇంతవరకు 90 మందికి పైబడి తెలుగు తరగతులలో చేరి పాఠాలు నేర్చుకున్నారు

•                  ప్రతి ఏటా ఉరమరగా, సగటున 12 మంది తరగతులలో నమోదు అవుతున్నారు

•                  ఇంతవరకు మనకి సహాయసహకారాలు అందించిన దాతలు 450 మించే ఉన్నారు

•                  భారత దేశం నుండి వచ్చిన విరాళాలు $60,000 దాటేయి.

•                  అమెరికా/ఇతర దేశాలు నుండి $330,000 వరకు విరాళాలు వచ్చేయి

•                  శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సహాయం లభించింది.

•                  బేంకులో, శాశ్వత నిధిలో $350,000 ఉన్నాయి. ఈ నిధి ఏటికి $10,000 వడ్డీ ఇస్తోంది.  ఈ నిధిని  $500,000 కి పెంచితే మన కనీస అవసరాలకి సరిపోతుందని బర్క్లీ వారు అంటున్నారు.

•                  ఈ ప్రయత్నం స్వయం పోషకంగా ఉండాలంటే మీరంతా  భూరి విరాళాలు ఇచ్చి మరొక్క సారి సహాయం చేసి ఈ నిధిని $500,000 కి చేర్చాలి.  ఎట్టి పరిస్తితులలోను ఇప్పుడు  ఈ ప్రయత్నం విరమించుకోవద్దని బర్క్లీ వారు ప్రార్ధిస్తున్నారు.

•                  బర్క్లీ బయట ఉన్నవారి సౌకర్యార్థం అంతర్జాలం మీద తెలుగు బోధనకి సాంకేతికమైన వెసులుబాట్లు ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.

విరాళాలు ఇవ్వటం ఎలా?

 UC Berkeley Foundation – Telugu Initiative కి చెక్కు రాసి ఈ దిగువ చిరునామాకి పంపమని ప్రార్ధన. మీకు యూనివర్శిటీ వారు ధన్యవాదాలతో పాటు రసీదు కూడ పంపుతారు.

 Friends of Telugu
 3212 Arbor Drive
 Pleasanton, CA 94566

 ఇతర వివరములకి మా “ఇంటి పుట” సందర్శించండి. http://www.FriendsOfTelugu.org/ucb

 ఎందరో మహానుభావులు. మీ అందరికీ మా వందనములు!

 All donations are tax deductible. Ask your company to match your gift.

 If you have any questions, please call Dr. Rao Vemuri at Phone: 925-846-5590 or Dr. Geeta Madhavi at 408-483-7700

 Email: rvemuri@gmail.com or Dr. Geeta Madhavi at kgeetamadhavi@gmail.com

 

Thank You

Friends of Telugu Foundation

Leave a Reply

%d bloggers like this: