నవంబర్ 29, 2013

ఊహాచిత్రం- పుస్తకావిష్కరణ

Posted in సాహితీ సమాచారం at 9:57 ఉద. by వసుంధర

తెలుగు కథ గత శతాబ్దంలో పుట్టింది. త్వరితగతిని వికసించింది. ఎందరో మహానుభావులు తెలుగు కథకు పుష్టినిచ్చి ముందుకు నడిపించారు. 

గత శతాబ్దం చివరి దశాబ్దంలో భారతదేశం ప్రపంచీకరణవైపు మొగ్గింది. తద్వారా సాధించిన ఆర్థిక ప్రగతి మనవారి మానసిక వికాసానికి దోహదం చేస్తుందనుకున్నాం. కానీ మనవారు భాషను పూర్తిగా పక్కన పెట్టి ప్రపంచ భాషలవైపు మళ్లుతున్నారు. ఫలితంగా మాతృభాష చతికిలబడితే, కథ కూడా చతికిలబడడవలసిందే కదా! కానీ గత శతాబ్దపు మహానుభావులు కొందరు ఇంకా తెలుగు కథను తమ భుజస్కంధాలమీద మోస్తున్నారు. తద్వారా తెలుగు కథ మనుగడ కొనసాగుతోంది. కానీ తెలుగు కథను ముందుకు నడిపించడానికి యువతరం చేయూత అవసరం. ఆ నడిపించేవారికి భావపరిణతి, ప్రతిభ అవసరం. అలాంటివారు కొందరే ఉన్నా వారు ఎందరి పెట్టో కాగలరు. ఎందరెందరికో ప్రేరణ కాగలరు. అలాంటివారిలో మేమెరిగినవారిలో అగ్రగణ్యుల్లో శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ ఒకరు. తెలుగు కథ భావికి డోకా లేదనిపించేలా రూపొందిన వారి ఊహాచిత్రం  నేడు- తెలుగు కథకు మహానుభావులనతగ్గ కొందరి ద్వారా ఆవిష్కరించబడుతోంది. పుస్తకానికీ, రచయితకూ, ఆవిష్కరించువారికీ అభివాదనాలర్పిస్తూ, సభకు ఆహ్వాన పత్రికను క్రింద ఇస్తున్నాం.

aripirala

 

1 వ్యాఖ్య »

  1. BVS Prasad said,

    Wish the function a grand success. Feel like being there. Regards BV S PRASAD


Leave a Reply

%d bloggers like this: