నవంబర్ 29, 2013
ఇది మల్లెల వేళ
విరహానికి అలనాటి మల్లీశ్వరి చిత్రంలోని మనసున మల్లెల మాలలూగెనే అన్న పాటకు మించిన భావగీతం లేదు.
కొమ్మల గువ్వలు గుసగుసమనిన, రెమ్మల గాలులు ఉసురుసురనిన, అలలు కొలనులో గలగలమనిన, అలలు కొలనులో గలగలమనిన, ద్రవ్వుల వేణువు సవ్వడి వినిన
నీవు వచ్చేవని నీ పిలుపే విని, నీవు వచ్చేవని నీ పిలుపే విని, కన్నుల నీరిడి కలయచూచితిని!
ఘడియ ఏని ఇక విడిచిపోకుమా, ఎగసిన హృదయము పగులనీకుమా!
ప్రియుని జోల పాడుతూ నిదుర చెదిరిందంటె నేనూరుకోనే అని గాలిని సడి చేయవద్దని హెచ్చరించిన భావుకత ఉండదు. (చిత్రం రాజమకుటం).
చాలులే నిదురపో అని జోకొడుతూ పసిపాపలో జాబిలికూనని చూడ గలిగిన కవిహృదయం అలౌకికం. (చిత్రం ఉండమ్మా బొట్టు పెడతా).
ప్రియుని ముచ్చ్టటగా పగలైతే దొరవేరా రాతిరి నా రాజువిరా అనగల చిలిపితనం అరుదు. (చిత్రం బంగారు పంజరం).
ఇవన్నీభావుకతలో తనకు తనే సాటి అనిపించుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి విశిష్టతలో కొన్ని అంశాలు మాత్రమే. వారికి అభివందనాలు. వారిని ఎప్పుడు స్మరిస్తే అది మల్లెల వేళ కదా! ఈ నవంబర్ 1, ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసం ప్రతి ఒక్కరూ చదువతగ్గది.
Leave a Reply