డిసెంబర్ 1, 2013

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 2:22 సా. by వసుంధర

ఓ కుర్రాడికి అన్నం తినేముందు బెల్లం ముక్క తినే అలవాటుంది. తలిదండ్రులెంత చెప్పినా వాడది మానడం లేదు. చివరికి తండ్రి కొడుకుని గురువు వద్దకి తీసుకెళ్లి, ఎలాగైనా వాడికి నచ్చజెప్పి వాడిచేత ఆ అలవాటు మాన్పించమని  కోరాడు. అందుకు గురువు వాళ్లని ఓ వారం ఆగి రమ్మన్నాడు. వారమాగి వెడితే, మళ్లీ ఇంకోవారమాగి రమ్మన్నాడు. అలా రెండు మూడు సార్లయ్యాక గురువు తన శిష్యుడితో, ‘నాయనా! అన్నం తినేముందు బెల్లం ముక్క తినడం మంచి అలవాటు కాదు. మానుకో’ అని హితవు చెప్పాడు. దీనికి ఆ శిష్యుడి తండ్రి ఆశ్చర్యపడి, ‘అయ్యా! ఈ ముక్క నేనడిగిన రోజునే చెప్పొచ్చు కదా! ఇన్నిరోజులెందుకు ఆగారు?’ అనడిగాడు. ‘అన్నం తినేముందు బెల్లం ముక్క తినే అలవాటు నాకూ ఉంది. నేనది మానుకోకుండా నా శి ష్యుడికెలా చెప్పగలను? ఆ అలవాటునుంచి బయటపడ్డానికి నాకిన్ని రోజులు పట్టింది’ అని ఆ గురువు బదులిచ్చాడు. 

ఇది నేను చిన్నప్పుడు చందమామలో చదివిన ఉపదేశార్హత అనే ఓ కథ. నేడీ కథ శిష్యులకు తెలుసు. కానీ గురువులకి తెలియదు. ప్రజలకు తెలుసు. కానీ నాయకులకి తెలియదు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? 

నేడు డెక్కన్ క్రోనికిల్ దినపత్రికలో వచ్చిన ఈ క్రింది కార్టూన్ నేటి పరిస్థితికి అద్దం పడుతోంది కదూ!

cartoon dc

 

Leave a Reply

%d bloggers like this: