డిసెంబర్ 2, 2013

భారత భాగ్యవిధాత

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:17 సా. by వసుంధర

1975లో ఇందిర ఎమర్జన్సీ విధించి 1977లో ఎత్తివేసింది. ఆగ్రహించిన జనం దేశమంతటా కాంగ్రెస్‍ని ఓడించి జనతా పార్టీకి పట్టం కట్టారు. ఒక్క తెలుగువారు మాత్రం జనతాని కాదని కాంగ్రెస్‍పై మొగ్గు చూపారు. తెలుగునాట కాంగ్రెసువారు దేనికైనా ఎవరినైనా తప్పు పడతారు కానీ- ఇందిర, రాజీవ్, సోనియాలని పల్లెత్తు మాట అనరు. అన్నవారిని దుయ్యబడతారు. తమిళనాడులో కాంగ్రెస్‍కి మనుగడ లేదు. కానీ చిదంబరానికి కేంద్రంలో అగ్రస్థానం. మధ్యప్రదేశ్‍లో కాంగ్రెస్‍ పత్తా లేదు. ఐనా దిగ్విజయ్‍కి కేంద్రంలో ప్రముఖస్థానం. బెంగాల్‍లో కాంగ్రెస్‍కి భావి లేదు. కానీ ప్రణాబ్ మాట కేంద్రంలో వేదవాక్కు. తెలుగునాట సుమారు పదేళ్లుగా కాంగ్రెస్ రాజ్యమేలుతుంది. కానీ కేంద్రంలో విలువ గల తెలుగు వారున్నారా? విలువ లేదని వాపోయినా సోనియాని మాత్రం అందుకు తప్పు పట్టని విధేయత వారిది. మరి సోనియాకు తెలుగువారంటే కోపమంటారు సి. నరసింహారావు. అందుకు వారు చెప్పిన కారణాలు చిత్రాతి చిత్రంగా ఉన్నాయి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వస్తున్న ఆసక్తికరమైన ఈ వ్యాసపరంపరలో చివరి భాగం కూడా చదివి ఈ విషయమై స్పందించవలసిందిగా కోరుతున్నాం.

sonia 4 december 2

Leave a Reply

%d bloggers like this: