డిసెంబర్ 7, 2013

అనైక్యవాదుల సమైక్యవాదం

Posted in కవితాజాలం at 10:14 సా. by వసుంధర

ఆ దేశమందేమొ కోట్లాది ప్రజలు, వారికున్నారు నలుగురే నేతలు

ఒక నేత బ్రహ్మ ఒకడేమొ శివుడు  ఒకడు  విష్ణువు వేరొకడు విఘ్నేశ్వరుడు

ప్రజల మధ్యను వచ్చె కలహాలు పదివేలు, మనుగడకు తోచినది విభజనే అది మేలు

ఇది నేరమిది ఘోరమనుకున్న నేతలు, కలిసినారొకచోట చర్చించగ చేతలు

బ్రహ్మనేరము శివుని మీదకు నెట్టె, శివుడు నేరము విష్ణువుకి అంటగట్టె

విష్ణువు తప్పంత గణేశుడిపై నెట్టె, నలుగురూ కోపముగ సిగ పట్లు పట్టె 

తెల్లబోయిన జనము ఇది యేమి అనిరి,  వారి చుట్టును చేరి కారణము అడిగిరి

ఆ నలుగురూ అపుడు ఏక కంఠము తోడ, విభజనను మేమొల్ల మేమొల్ల మీడ

సమైక్యవాదము మాది సమైక్య నాదము మాది, అనిరి నవ్విరి బుజ్జగించగ మంది

మంది వెడలెను ఆశ మనములందున నింపి, ఎరుగరుగ వారసలు రాజకీయపు రొంపి

వారటుల వెడలిరి నేతలది చూసిరి, ఒకరిపై ఒకరొకరు నిప్పులను కురిపించిరి

బ్రహ్మనేరము శివుని మీదకు నెట్టె, శివుడు నేరము విష్ణువుకి అంటగట్టె

విష్ణువు తప్పంత గణేశుడిపై నెట్టె, నలుగురూ కోపముగ సిగ పట్లు పట్టె 

దెయ్యాలు వేదాలు వల్లించు నేల, అనైక్యులు సమైక్యమనిన ఆశ్చర్యమేల?

1 వ్యాఖ్య »

  1. ఒకడు కర్ణాటక, ఇద్దరు తమిళనాడు, ఒకడు మహారాష్ట్ర, ఒకడు కేరళ, ఒకడు మధ్య ప్రదేశ్. ఒకడు కాశ్మీరుడు.వీళ్ళ అధినేత్రి ఇటలీ. ఇవన్నీ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో చెల్లని నాణేలే. ఇల్లు అలకగానే పండుగా? అధినాయకి జన్మదిన కానుకలు ఇ.వి.ఎం లలో భద్రంగా ఉన్నై. ఇండియానా? ఇటలీనా? భవితవ్యం బుల్లి తెరపై చూద్దాం.


Leave a Reply

%d bloggers like this: