డిసెంబర్ 10, 2013

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:47 సా. by వసుంధర

నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్‍లో మూడింట రెండొంతులు, రాజస్థాన్‍లో నాలుగింట మూడొంతులు, ఛత్తీస్‍ఘడ్‍లో సగానికి కొద్దిగా పైన, డిల్లీలో సగానికి కాస్త తక్కువైనా అత్యధిక మెజారిటీని సాధించింది బిజెపి. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోయింది. అవినీతికి వ్యతిరేకంగా నినదిస్తూ తొలిసారిగా రాజకీయ రణరంగంలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ డిల్లీలో ఊహించని ఘన విజయాన్ని సాధించి 70లో 28 సీట్లని కైవసం చేసుకుంది. దీనికి వారివారి వ్యాఖ్యలు ఏమిటంటే…..

ఈ విజయం మోడీకి అనుకూలం కాదు- కాంగ్రెస్‍కి ప్రతికూలం- అంటాడు నితీష్‍కుమార్. ఆయనకి మోడీ అంటే పడదు.

ఈ ఫలితాలు రాష్ట్రాలకే పరిమితం. కేంద్రప్రభుత్వ ఎన్నికల ఫలితాలు వేరే ఉంటాయి- అంటారు కాంగ్రెస్ ప్రముఖులు.

2014లో కాంగ్రెస్ ఓడినా, ఎన్నికైన వారు జోకర్లనీ- ఏడాదిలోగా పరస్పర కలహాలతో పడిపోతారనీ- 2015కల్లా ప్రజలు తిరిగి కాంగ్రెస్‍కే పట్టం కడతారనీ- అంటాడు మణిశంకర్ అయ్యర్.

ఇది కాంగ్రెస్ అవినీతి పాలనకు పౌరులిచ్చిన తీర్పు అంటుంది బిజెపి.

నాకు పదవి వద్దు. అవినీతిని ఎదిరించడమే నా ధ్యేయం. అవినీతికి పట్టం కట్టిన కాంగ్రెస్, బిజెపిలతో పొరపాటున కూడా పొత్తు చెయ్యను. ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే మళ్లీ ఎన్నికలకు వెడతాను తప్ప- అంశాల ఆధారంగా ఏ ఇతర రాజకీయ పక్షానికీ మద్దతు ఇవ్వను- అంటాడు అరవింద్ కేజ్రీవాల్.

 

ఈ ఎన్నికలు ప్రజల ఆకాంక్షల్ని ప్రతిఫలిస్తున్నాయనీ- వారికి కావలసింది సుపరిపాలన అనీ- అది ఇవ్వడానికి తమ వంతు శాయశక్తులా ప్రయత్నిస్తామనీ- అందుకు తాము చేపట్టనున్న సత్వర చర్యలివి అనీ ఒక్కరు అనడం లేదు. ఎదుటివారిని తప్పు పట్టడం, తమని తాము పొగుడుకోవడం- ఇదీ మన గురివింద పార్టీల వ్యవహారం. 

ఎవరి తప్పులు వారు తెలుసుకుందుకూ, సుపరిపాలన అందించేందుకూ, మళ్లీ మళ్లీ ప్రజలపై ఎన్నికల వ్యయాన్ని విధించకుండా చూడడానికీ ప్రయత్నించని రాజకీయ పక్షాలు మనవి. ఈ క్రింది కార్టూన్ చూడండి. ఇలాంటి రాజకీయవాదుల గురించి జనం స్పందన ఊహించడానికి వసుంధర కథ వీడా నా కొడుకటంచు చదవండి.

cartoon aj

 

1 వ్యాఖ్య »

  1. CS Sarma said,

    Yes, they have no service attitude.


Leave a Reply

%d bloggers like this: