డిసెంబర్ 11, 2013
అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014
ఈక్రింది సమాచారం అందించిన నండూరి సుందరీ నాగమణికి ధన్యవాదాలు.
అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014
మాట ఒక విప్లవం. రాత ఒక విప్లవం. పుస్తకం ఒక విప్లవం. సమాజాల్ని సమూలంగా మార్చేసిన విప్లవాలు ఇవి.
సాంకేతిక విప్లవం ఇప్పుడు మనం చవిచూస్తున్నామ్. ప్రపంచ భాషలను వేగంగా ప్రభావం చేస్తుంది నేటి సాంకేతిక విప్లవం. నిన్నటిలా నేడు లేదు. నేటిలా రేపు ఉండబోదు. నేటి సాంకేతిక పరిజ్ఙానం పరిపూర్ణంగా అందుకుంటూ, రేపటి తెలుగు పుస్తకం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న తెలుగు వారి అభిమాన, విశ్వసనీయ పుస్తక ప్రపంచం కినిగె డాట్ కామ్ తెలుగు సాహితీ ప్రపంచానికి సగర్వంగా సమర్పిస్తుంది అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014.
బహుమతి ఏమిటి?
మొదటి బహుమతి: లక్ష రూపాయలు.
రెండవ బహుమతి: పాతిక వేల రూపాయలు.
మూడవ బహుమతి: పది వేలు.
ఎలా పాల్గొనాలి?
మీ కొత్త తెలుగు నవలను కినిగెలో ఈపబ్లిష్ చెయ్యండి. డిస్క్రిప్షనులో తెలుగు నవలా పోటీ కోసం అని వ్రాయండి.
ఈ పబ్లిష్ సహాయం కోసం ఇక్కడ నొక్కండి.
గడువు ఎప్పటివరకు?
06/06/2014 వరకూ, అనగా జూన్ ఆరు 2014 మద్యాహ్నం 12:00 గంటలు భారత కాలమానం ప్రకారం. ఈ లోపులో కినిగెలో ఈపబ్లిష్ విజయవంతంగా చేసిన నవలలే పోటీకి అర్హమైనవి.
విజేతలను ఎలా నిర్ణయిస్తారు?
కినిగె పాఠకులు మీ నవలలు చదివి వాటికి రేటింగు ఇస్తారు. ఈ రేటింగు ఆధారంగా ఉత్తమ పది (లేదా ఆపై) నవలలనుండి న్యాయనిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Leave a Reply